Tirumala : మూడు రోజులు వరుస సెలవులు (Three consecutive days off) వారాంతం రద్దీ పెరగడంతో తిరుమలలో ఏరోజుకారోజు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆఫ్లైన్లో ప్రత్యేక కౌంటర్లలో 800 టిక్కెట్లు జారీచేస్తుండగా ఐదింతలు రెట్టింపయిన భక్తులు ఈ టిక్కెట్లకు ఐదువేల మంది వరకు క్యూలైన్లలో బారులుతీరి నిలబడు తున్నారు. ఆదివారం సాయంత్రం దర్శనానికి సంబంధించి శనివారం రాత్రి 9 గంటల (Saturday night 9 pm) ప్రాంతంలో శ్రీవాణి టిక్కెట్లు జారీచేసే కౌంటర్ ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. అయితే గత రాత్రి జరిగిన తోపులాట, రద్దీతో ఆదివారం ఉదయం 10 గంటలకే భక్తులకు దర్శన టిక్కెట్లు జారీచేశారు. శనివారం రాత్రి క్యూలో ముందు గానే వచ్చిన భక్తులను విజిలెన్స్ సిబ్బంది ముందుగా సమాచారం అందించి అక్కడకు వెనక్కుపంపారు. దీంతో ఆదివారం వేకువజామున 4గంటలనుండే భారీగా భక్తులు ఈ కౌంటర్వద్ద నిలబడ్డారు. ఓవైపు చిరుజల్లులు కురుస్తున్నా, విపరీతమైన చలిగాలులు వున్నా భక్తులు ఖాతర్చేయలేదు. తమకు ఆ దేవుని దర్శనం చేసుకుంటే చాలనే విశ్వాసం వ్యక్తం చేశారు.

సాధారణరోజల్లోకూడా TTD విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా ఉదయం టిక్కెట్లు జారీచేస్తే సాయంత్రం ఆలయంలోపల కులశేఖరపడివద్ద మొదటిగడప నుండి శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రశాంతంగా, కళ్లారా మరీ దగ్గరగా దర్శనం చేసుకునే భాగ్యం ఉండటంతో చాలావరకు భక్తులు ఈ దర్శనాలపై ఆధారపడుతున్నారు. టిటిడి అధికారులు ఈ టిక్కెట్లను పెంచాలని భక్తులు కోరుతున్నారు. సాదారణరోజుల్లోనూ 1,500మంది వరకు భక్తులు శ్రీవాణికోసం డిమాండ్ ఉంది. ఇక వారాంతం, ప్రత్యేక సెలవురోజుల్లో ఈ రద్దీ ఐదిం తలు రెట్టింపవుతోంది. మరీ టిటిడి అధికారులు భక్తుల అవసరానికి ఎలా స్పందిస్తారనేది చూడాల్సిందే. రానున్న రోజుల్లో సామాన్య భక్తులు కూడా దేవదేవుడిని మరింత దగ్గరగా ప్రశాంతంగా దర్శనం చేసుకునే వీలుకలిగేలా శ్రీవాణి బ్రేక్ దర్శనాలపైనే ఆధారపడే సూచనలు లేకపోలేదు. ప్రస్తుతం రోజువారీగా 2వేలమంది భక్తులు శ్రీవాణి బ్రేక్ దర్శనం చేసుకుంటున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :