పిల్లల విషయంలో పెద్దవాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి క్షణాల నిర్లక్ష్యం తిరిగి సరిచేయలేని నష్టాన్ని మిగులుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఆదివారం (ఆగస్టు 17) చోటుచేసుకున్న దారుణ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. నాలుగేళ్ల బాలుడు భవనం పై అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పూర్తీ వివరాలు,సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటేల్‌గూడ పరిధి బీహెచ్‌ఈఎల్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ భవనం రెండో అంతస్తులో నివాసం ఉంటున్న కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది.

తల్లిదండ్రుల ఆవేదన
నాలుగేళ్ల హర్షవర్ధన్ (Harsh Vardhan) అనే బాలుడు.. బయటకు వెళ్తున్న తండ్రికి ‘బై’ చెబుతూ పొరబాటున రెండో అంతస్తు నుంచి జారిపడ్డాడు. అంత ఎత్తునుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు కళ్లముందే మద్దులొలుకుతూ గెంతులేస్తూ అల్లరిచేస్తున్న కుమారుడు క్షణాల్లో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతితో పరిసర ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: