భారత వాయుసేన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట జరిపిన మెరుపు దాడుల్లో పాకిస్థాన్ (Pakistan)కి తీవ్ర నష్టం జరిగింది. ఎప్పటి నుంచి ఈ విషయం పాక్ మౌనంగా ఉండిపోయినా, ఇప్పుడు మాత్రం పరోక్షంగా ఒప్పుకోక తప్పలేదు.ఈ దాడిలో 13 మంది సైనికులతో పాటు మొత్తం 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ అంగీకరించింది. ఇదంతా వాళ్ల స్వాతంత్ర్య దినోత్సవం రోజునే బయటికి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ.ఈ దాడికి బదులుగా మే 7న తెల్లవారుజామున భారత వాయుసేన ఆధునిక మిరాజ్ జెట్‌లతో పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిగాయి.

100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టుబడ్డారు
ఆపరేషన్ అనంతరం భారత ప్రభుత్వం 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. దాడులన్నీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్ అంతర్గత ప్రాంతాలపై జరిగాయి.పాకిస్థాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ దాడుల్లో మరణించిన సైనికులకు మరణానంతరం పురస్కారాలు ప్రకటించింది. ఇదే పరోక్షంగా భారత్ దాడుల ప్రభావాన్ని అంగీకరించినట్లు అనిపిస్తోంది.భోలారీ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్‌కు ‘తమ్ఘా-ఇ-బసాలత్’ పురస్కారం ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరికి కూడా మరణానంతర గౌరవాలు అందించారు.
గాయపడిన వారిలో విదేశీ టెక్నీషియన్లు కూడా ఉన్నారు
నూర్ ఖాన్, షోర్‌కోట్, జాకోబాబాద్ వంటి ఎయిర్‌బేస్‌లపై దాడుల్లో అనేకమంది గాయపడ్డారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో కొంతమంది అమెరికన్ టెక్నీషియన్లు కూడా గాయపడ్డారు.ఇన్నాళ్లు నిజం దాచిన పాకిస్థాన్, ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాన్ని బయటపెట్టక తప్పలేదు. ఇది పరోక్షంగానే అయినా, భారత్ నిర్వహించిన దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రపంచానికి తెలియజెప్పినట్టే.పాకిస్థాన్ అధికారికంగా ఒప్పుకోకపోయినా, అవార్డుల ప్రకటనతో సత్యం వెలుగులోకి వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ తలపెట్టిన దెబ్బ వల్ల పాక్‌కి తలదించుకునే పరిస్థితి వచ్చింది.
Read Also :