తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు.. ఉదయం ఇంటినుంచి ఉద్యోగం కోసం వెళ్లి రాత్రికి చేరుకుంటారు. ఇద్దరూ కష్టపడితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి నేడు. పిల్లలపై గంపెడన్నీ ఆశలతో కష్టపడి,స్కూలు కోసం వేలకువేలు ఫీజులు కడుతూ, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు చేతికి అందివస్తే, వారి అభివృద్ధిని చూసి, తృప్తి చెందుతారు. కానీమాయదారిలోకం పిల్లల్ని, యువతను బుద్ధిగా ఎదిగేందుకు సహకరించేందుకు. పాడైపోయేందుకు అన్ని దారులు వీరికి సాయం చేసేందుకు యత్నిస్తుంటాయి. అందుకే తల్లిదండ్రులు ఎంత,బిజీగా ఉంటున్నా పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం.
యువత ఈ మత్తుకుబానిసై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు
ఎందుకు ఇదంతా చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇటీవల గంజాయి నగరాల్లోనే కాదు, పట్టణాలు, గ్రామాలకు సైతం చాపకింద నీరులా ప్రవహిస్తున్నది. ఒకప్పుడు బిగ్ సిటీస్ పరిమితమైన గంజాయి (Ganjayi) నేడు అంతటా పాకిపోతున్నది. ఎక్కడ పడితే అక్కడ విరివిగా లభిస్తుంది. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకుబానిసై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు చాక్లెట్ల మాదిరి ఎక్కడిక్కడ గంజాయి అమ్మేస్తుంటే మరికొందరు చాక్లెట్ల రూపంలో దీన్నివిక్రయిస్తున్నారు. ఇలా వివిధ రూపాల్లో గంజాయి యువత చెంతకు చేరుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నది.

గంజాయిని అడ్డుకునే మార్గాలులేవా?
రెండు తెలుగు రాష్ట్రాలలో రోజుకు ఒక కేసు అయినా గంజాయి వార్తలు ఉంటున్నాయి. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి సరఫరాను మాత్రం అడ్డుకట్టవేయలేకపోతున్నారు. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకు బానిగా జీవిస్తున్నారు. గంజాయి కోసం అక్రమాలు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతున్నారు.విపరీత ప్రవర్తనతో కన్నవారికి గుండెకోత మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం. కానీ డ్రగ్స్, హెరాయిన్, కొకైన, హాషం ఆయిల్, గంజాయి, హైడ్రోఫోనిక్ గంజాయి (Hydroponic cannabis) వంటివీటికి ఒక్కసారి అలవాటు పడితే ఇక దీనికి బానిసకాకతప్పదు. వీటిని తీసుకోకపోతే చచ్చిపోతామేమోనన్న భ్రమలోకి తీసుకుపోయి మానసికంగా, శారీరకంగా ఎంతో కుంగదీస్తాయి.
తెలంగాణలో దేశ విదేశాల నుంచి గంజాయి సరఫరా
తెలంగాణలో దేశవిదేశాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా బ్యాంకాక్, నైజీరియా, థాయ్లాండ్, మలేషియా సహా ఇతర దేశాల నుంచి గంజాయి,రాష్ట్రంలోకి చేరుతోందని అంటున్నారు. ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి గంజాయి రాష్ట్రంలోకి సరఫరా అవుతుందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తించే స్థాయికి దిగజారుస్తాయి.రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట గంజాయిని పోలీసులు తరచూ పట్టుకుంటూనే ఉన్నారు. సరఫరాను అడ్డుకుంటూ బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఈ సరఫరాకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.
వైద్యులు దీనిపై ఏమని చెబుతున్నారు?
గంజాయి, డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ వంటి మత్తుపదార్థాల బారిన పడితే ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలనువదలడం లేదు. పైగా వీటికోసం ఎంత దూరమైనా వెళ్లడానికైనా సిద్ధపడుతున్నారు. చిన్నగా, పొడి పదార్థాంగా లభిస్తుండడంతో సులభంగా గంజాయి యువత చేతుల్లోకి చేరుతోంది. వీటినివిచ్చలవిడిగా తీసుకుంటున్న యువత తమ ఆరోగ్యానికి చేటు చేసుకుంటున్నారు. ఆ మత్తులో మునిగి కొందరు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
గంజాయిలో ప్రధానంగా ఉండే రసాయనం ఏది?
గంజాయిలో ప్రధాన మత్తు కలిగించే రసాయనం టెట్రాహైడ్రోకేనాబినాల్ (THC). ఇది మెదడు నాడీ కణాలపై ప్రభావం చూపి మత్తు కలిగిస్తుంది.
గంజాయి అంటే ఏమిటి?
గంజాయి అనేది కేనాబిస్ (Cannabis) అనే మొక్క నుంచి తీసే మత్తు పదార్థం. దీని ఎండిన ఆకులు, పుష్పాలు, విత్తనాలు, పొడి రూపంలో వాడడం చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: