హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ధిపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా తద్వారా ఒకవైపు భక్తుల సంఖ్యను పెంచడంతో పాటు టూరిజంను అభివృద్ధి చేయడం ద్వారా కూడా ఆదాయాన్ని పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివృద్ధి (Development of many temples) కి మొత్తం రూ.779.54 కోట్లను వ్యయం చేయనున్నారు. వీటిలో సుమారు రూ.200 కోట్లను 9 ప్రముఖ ఆలయాలపై వెచ్చించనుండగా మరో రూ.579.74 కోట్లను రాష్ట్రంలోని 502 చిన్న దేవాయలకు వెచ్చించనున్నారు. వీటి ద్వారా అలయాల అభివృద్ధికి నిధులివ్వడమే కాక.. దేవాలయాల భూములను కాపాడేందుకు డిజిటలైజేషన్ మొదలు పెట్టారు.
రాష్ట్రంలోని తొమ్మిది ప్రముఖ దేవాలయాల కోసం
ఈ సంస్కరణలు దేవస్థానాల పరి పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభు త్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని తొమ్మిది ప్రముఖ దేవాలయాల కోసం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సిజిఎఫ్, ఇతర నిధుల నుంచి మొత్తం రూ. 779.74 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణాలో 48 ఆలయాల్లో ఎన్డీఎఫ్ పనులకు రూ.64 కోట్లకు పైగా నిధులు కేటాయించ నున్నారు. ఆర్ అండ్ బీ వర్క్ కింద 24 దేవాలయాల్లో రూ.7.86 కోట్లు ఇవ్వనున్నారు. వీటితో పాటు.. తెలంగాణలో చిన్న చిన్న ఆలయాలకు రూ.502 కోట్లను సీజీఎఫ్ నిధుల కింద కేటాయించనున్నారు.

ఈ దేవాలయాల అభివృద్ధి కోసం
ఈ మాస్టర్ ప్లాన్లో చేర్చిన తొమ్మిది ముఖ్య దేవాలయాలు ఇలా ఉన్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం, బాసర జ్ఞానసరస్వతి దేవస్థానం, కొండగట్టు ఆంజ నేయస్వామి ఆలయం, కొడంగల్ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఆలంపూర్లో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట రామ లింగేశ్వరస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, చెర్వుగట్టు పార్వతిజడల రామలింగేశ్వరస్వామి ఆలయం. ఈ దేవాలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే వేములవాడ రూ.111.25 కోట్లు, బాసరకు రూ.50 కోట్లు, భద్రాచలానికి రూ 34 కోట్లు, కొడంగల్కు రూ.30 కోట్లు వంటి నిధులు కేటాయించారు. ఇది ఆలయాల్లో మోలిక వసతులను మెరుగా పరచడమే కాకుండా, పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుంది దేవాదాయ భూముల పరిరక్షణ.. దేవాలయాల అభివృద్ధిపై దృ సారించడంతో పాటు, దేవాదాయ భూముల పరిరక్షణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఆమె ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
కొండా సురేఖ పార్లమెంట్ నియోజకవర్గం కాదు, తెలంగాణలోని వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆమె రాజకీయ ప్రయాణం ఎప్పుడు మొదలైంది?
కొండా సురేఖ 1990లలో రాజకీయాలలోకి ప్రవేశించి, పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: