ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు (నెల్లూరు) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలుపుతూ కోవూరు నియోజకవర్గ రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (MLA Prashanthi Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, వరికి గిట్టుబాటు ధర తదితర ప్రభుత్వ రైతు సంక్షేమ విధానాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వందలాదిగా రైతులు తరలివచ్చి కొడవలూరు నుంచి రాజుపాలెం వరకు భారీ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ గతంలో అస్తవ్యస్తమైన సాగునీటి కాలువల వల్ల ఆయకట్టు చివరి భూములకు నీటిపారుదల కష్టతరంగా మారిందన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక సాగునీటి కాలువలు బాగా లేవని రైతుల నుంచి ఫిర్యాదు రాగానే ప్రభుత్వ నిధులు అందుబాటులో లేకుంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సాగు కాలువల్లో పూడిక తీసి రైతులను ఆదుకున్నామన్నారు.
చంద్రబాబు ముందుచూపు
గతంలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు దక్కడమే గగనమైన పరిస్థితుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనడమే కాకుండా 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుసంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల ముందు చేసిన అన్నదాత సుఖీభవ హామీ అమలుతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. పరిపాలన చంద్రబాబు (Chandrababu) ముందుచూపు రాష్ట్రంలోని దక్షత కలిగిన నాయుడు కారణంగా ప్రధాన జలాశయాలన్ని జలకళతో కళ కళ లాడుతున్నాయన్నారు. పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ వద్ధతులను తెలియజేస్తూ వ్యవసారంగాన్ని లాభసాటిగా చంద్రబాబునాయుడు మార్చారన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సాగునీటి సంఘాలను వునరుద్ధరించే పునరుద్ధరించడంతో పాటు రైతులకు సబ్సిడీ ధరపై ప్రేయర్లు, స్పిన్కర్లు డ్రోన్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా
ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ లోని దాదాపు అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్య నిర్మూలించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని కోవూరులో ఈరోజు జరిగిన జాబ్ మేళా గురించి ప్రస్తావించారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా బడ్జెట్లో 42 వేల 340 కోట్ల రూపాయలు కేటాయించి తాను రైతు పక్షపాతినని చంద్రబాబు చాటుకున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య. టిడిపి నాయకులు బెజవాడ వంశీకృ ష్ణారెడ్డి, కొడవలూరు మండల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గా చేసిన ముఖ్యమైన పాలనా కార్యక్రమాలు ఏమిటి?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ముఖ్యంగా ఐటీ రంగంలో, ప్రజా సేవలో మార్పులు తీసుకువచ్చారు.
చంద్రబాబు నాయుడు గారి పాలనపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయి?
చంద్రబాబు నాయుడు గారి పాలనపై కొన్ని కోణాల్లో సానుకూల, కొంతమేర ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: