హైదరాబాద్ : తెలుగురాష్ట్రాలలో అతిభారీ వర్షాల(Trains cancelled) కారణంగా అక్కడక్కడ వరద ప్రవాహం పోటెత్తడంతో రైళ్ల వంతెనలపై రాకపో కలకు రైల్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వేగాన్నితగ్గించాలని సూచనలు చేశారు. ఐదు రోజుల పాటు 10రైళ్లు రద్దు చేసినట్లు దక్షి ణ మధ్య రైల్వే ప్రకటించింది.
అంతేకాకుండా పలు రైళ్లకు అంతరాయంఏర్పడుందని వివరించింది, పాపటపల్లి – డోర్నకల్ బైపాస్ నడేమ మూడోరైల్వేలైను నిర్మాణ పనుల నేపథ్యంలో రాకపోకలను మళ్లించి నట్లు పేర్కొంది. 14 నుంచి 18వ తేదీ వరకు డోర్నకల్ విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767), విజయవాడ డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67768), కాజీపేట డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765), డోర్నకల్ కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766), విజయవాడ సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713)
సికింద్రాబాద్-విజయవాడ(Secunderabad-Vijayawada)ట్రెయిన్ నెంబర్ 12714), విజయవాడ భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215), భద్రాచలం రోడ్ విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216), గుంటూరు-సికింద్రాబాద్(Guntur-Secunderabad)(ట్రెయిన్ నెంబర్ 12705), సికింద్రాబాద్ గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706)లను రద్దు చేశారు. అదేవిధంగా మరో 26రైళ్లలో కొన్నింటిని ఒక రోజు, మరికొన్నింటిని రెండు రోజుల పాటు రాక పోకలు ఉండవని వెల్లడించింది, మూడు రైళ్లు ఆలస్యంగా బయల్దేరతాయని, ఏమైనా సందేహాలుంటే సహాయం కోసం 139 డయల్ చేయాలని రైల్వే అధికారులు.(Trains cancelled)
Read Hindi News: hindi.vaartha.com
Read also: