హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి(Kanchi Gachibowli) భూముల్లో పర్యావరణ పరిరక్షణ చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య లు చేసింది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని పర్యావరణ పరిరక్షణ కూడా పరి గణలోకి తీసుకోవాలని సీజేఐ ధర్మాస నం పేర్కొంది. సంచలనం సృష్టించిన కంచెగచ్చిబౌలి భూముల అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరిగింది. ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలపై గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఈ భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేస్తుట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఅర్ గవాయ్(CJI Justice B.R. Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖిపర్యావరణం, వన్యప్రాణుల రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. పర్యావరణం కోసం రాష్ట్రం చేస్తున్న చర్యలను అభినందిస్తున్నాం. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. పర్యావరణాన్ని సమతుల్యం చెయ్యాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయండి. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే.. అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తాం. నా రిటైర్మెంట్ లోపల వీటన్నింటికీ పరిష్కారం చూపాలి అని వ్యాఖ్యలు చేశారు. అయితే సమగ్ర ప్రణాళికను అందించేందుకు 6 వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోర్టును కోరగా ఇందుకు న్యాస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.(Kanchi Gachibowli)

Read also: