గత కొంతకాలంగా పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా వీధి కుక్కలు (Stray dogs)స్వైర విహారం చేస్తున్నాయి. మనుష్యులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెత్తుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయం లోనైనా రోడ్ల మీద నడుచుకుంటూ వేళ్లే వారిపై వీధి కుక్కలు (Stray dogs) డులకు పాల్పడుతుం డడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే స్థానికులు వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. అయితే కుక్క కరిస్తే రేబిస్ వ్యాధి సోకుతుందని తెలిసిందే.. ఇటీవల కుక్కని కాపాడి.. ఆ కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి (Rabies disease)సోకి మరణించిన మన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ లాస్ట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే వీధి కుక్కలకు (Stray dogs)వీలైంత దూరంగా ఉంటారు.

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు.. హైదరబాద్, బెంగళూరు, పూనే వంటి పెద్ద పెద్ద నగరాల్లో నివసించే యువతీయువకులు వీధి కుక్కలను చేరదీసి.. వాటికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఇలా జాలితో వీధి కుక్కలను చేరదీయడం వారి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు ఎంత ప్రేమ చూపించినా అవి దాడి చేస్తే.. రేబిస్ సోకే ప్రమాదం ఉందని.. ఒకొక్క సారి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రేబిస్ వ్యాధి సోకితే ఆ వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేస్తూ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో ఒకటి కబాడీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి చెందినది.

యూపీకి చెందిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలం ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. బ్రిజేష్ సోలంకి ఒక వీధి కుక్కను రక్షించాడు. అయితే మురికి నీటి లో పడిన ఓ కుక్కని రక్షించాడు. ఆ కుక్కే బ్రిజేష్ ని కరిచింది. అయితే ఈ విషయం అతను గమనించ లేదు.. తన చేతిమీద గాయం కబాడీ ఆడుతున్న సమయంలో తగిలిందని భావించాడు. దీంతో అతనికి రేబిస్ వ్యాధి సోకింది. ఎంత వైద్యం చేసినా వైద్యులు రేబిస్ వ్యాధిని నయం చేయలేకపోయారు. చివరకు బ్రిజేష్ నీటిని చూసి భయపడడం, కుక్క మాదిరి పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తమ కొడుకు పరిస్థతి చూసి ఆహాయ స్థితిలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చివరికి ఆ వ్యాధే అతడి ప్రాణాలు తీసింది. బ్రిజేష్ చివరి సమయంలో పడిన బాధకి సంబంధించిన ఒక వీడియోనూ మేఘ్ అప్డేట్స్ అనే ఎక్స్ హ్యాండిల్లో యూజర్ పోస్ట్చేశారు.
వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉన్న దేశం ఏది?
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వీధికుక్కలు మరియు పిల్లులు భారతదేశంలోనే ఉన్నాయి, అలాగే అత్యధికంగా రేబిస్ మరణాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చాలా రేబిస్ మరణాలు నివేదించబడలేదు. 2001 జంతు జనన నియంత్రణ నియమాలకు అనుగుణంగా, వీధికుక్కలను చంపకూడదు, కేవలం క్రిమిరహితం చేయాలి. వీధికుక్కలను క్రిమిరహితం చేయడానికి మునిసిపాలిటీలకు డబ్బు లేదు.
వీధి కుక్కలు లేని దేశం ఏది?
నెదర్లాండ్స్ జంతు సంక్షేమం మరియు బాధ్యతాయుతమైన జంతు పెంపకం గురించి అనేక ఇతర చట్టాలను ఆమోదించింది, వాటిలో 1961 జంతు సంరక్షణ చట్టం కూడా ఉంది. అయితే, 1996లో, ప్రభుత్వం దేశంలోని అన్ని వీధి కుక్కలకు స్పేయింగ్ మరియు న్యూటరింగ్ ఆపరేషన్లు చేయాలని ఆదేశించింది. స్ట్రేడ్స్ లేని దేశం వైపు ఇది మొదటి అడుగు!
నెదర్లాండ్స్ వీధి కుక్కల సమస్యను ఎలా పరిష్కరించింది?
కుక్కల పన్ను ప్రవేశపెట్టడం వంటి ప్రారంభ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, వీధి కుక్కల జనాభా కొనసాగింది, దీని వలన కారుణ్య పరిష్కారాలను అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. రెస్క్యూ షెల్టర్ల నుండి దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడానికి దుకాణాలలో కొనుగోలు చేసిన కుక్కలపై అధిక పన్నులు విధించడం వంటి మార్గదర్శక చర్యలను డచ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: