हिन्दी | Epaper

Rain: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజుల సెలవులు

Vanipushpa
Rain: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజుల సెలవులు

హైదరాబాద్ (Hyderabad) సహా పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలకు వరంగల్, నల్గొండ(Warangel, Nalgonda) జిల్లాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది. మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 72గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అధికారుల సెలవులు రద్దు చేశారు. ఇదే సమయంలో విద్యాశాఖ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. మహబూబ్‌నగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఈ 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

Rain: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజుల సెలవులు
Rain: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజుల సెలవులు

హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికారులు హాఫ్ డే సెలవు

ఈ సెలవులతో ఈ 5 జిల్లాల్లో స్కూళ్లకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఎందుకంటే 13, 14 వర్షాల ఎఫెక్ట్‌తో సెలవులు ఇచ్చారు. 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం.. ఇలా 5రోజుల సెలువులు వచ్చాయి. ఇక హైదరాబాద్ పరిధిలో మాత్రం అధికారులు హాఫ్ డే సెలవు ఇచ్చారు. దీంతో మధ్యాహ్నాం వరకు స్కూళ్లు తెరుచుకోనున్నాయి. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు ఎట్టిపరిస్థితుల్లో తెరవకూడదని.. ఒకవేళ తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లోనూ స్కూళ్లకు ఫుల్ డే హాలిడే ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రస్తుతానికి హాఫ్ డే వరకు సెలవులు ఇచ్చిన అధికారులు.. పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.

జీహెచ్ఎంసీ అలర్ట్
రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి, ఖమ్మం, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల, కొమురంభీం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలో 269 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని తెలిపారు.

వర్షం పడటానికి ప్రధాన కారణాలు ఏమిటి?
మేఘాలు నీటి బిందువులతో తయారవుతాయి. ఒక మేఘం లోపల, నీటి బిందువులు ఒకదానిపై ఒకటి ఘనీభవిస్తాయి, దీనివల్ల బిందువులు పెరుగుతాయి. ఈ నీటి బిందువులు మేఘంలో నిలిచి ఉండటానికి చాలా బరువుగా మారినప్పుడు, అవి వర్షంగా భూమిపైకి వస్తాయి.

నాలుగు రకాల వర్షపాతం ఏమిటి?
నాలుగు ప్రధాన రకాల వర్షపాతం ఉష్ణప్రసరణ, ఒరోగ్రాఫిక్, సైక్లోనిక్ (లేదా ఫ్రంటల్) మరియు ఉరుములు. ఈ రకాలు వాటికి కారణమయ్యే వాతావరణ ప్రక్రియల ద్వారా వేరు చేయబడతాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/young-scientists-must-move-forward-with-determination/national/529517/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870