ఇప్పటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. సినిమా తారలు, ముఖ్యంగా హీరోయిన్స్‌కి సోషల్ మీడియా వేదికగా క్రేజ్ ఎంతగానో ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారు అభిమానులతో నేరుగా మమేకమవుతారు, తమ ప్రాజెక్టులు, వ్యక్తిగత విషయాలు, ఫ్యాషన్ అప్డేట్స్ పంచుకుంటారు. అయితే, ఈ క్రేజ్ వెనుక ఒక చీకటి వైపు కూడా ఉంది. అదే ట్రోలింగ్.సోషల్ మీడియా (Social media) లో హీరోయిన్స్‌పై వచ్చే ట్రోల్స్, విమర్శలు, వ్యక్తిగత దూషణలు చాలా సార్లు అవాంఛిత ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఏదైనా ఓపెన్ కామెంట్ చేసినా, వింతగా కనిపించే డ్రెస్సులు వేసినా, లేదా సింపుల్‌గా ఒక ఫోటో పోస్ట్ చేసినా,నెటిజన్స్‌లో కొంతమంది దానిని తప్పుగా అర్థం చేసుకుని పెద్ద ఇష్యూలా చూపిస్తారు. చాలాసార్లు హీరోయిన్స్‌కి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే జరుగుతాయి. కొంతమంది వ్యక్తులు కావాలనే వారిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటారు.
టాలీవుడ్లో బలమైన స్థానం సంపాదించుకుంది
ఈ సమస్యపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బహిరంగంగా స్పందించింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన రష్మిక, తక్కువ కాలంలోనే తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో అగ్రశ్రేణి హీరోయిన్గా ఎదిగింది. “గీత గోవిందం”, “డియర్ కామ్రేడ్”, “సరిలేరు నీకెవ్వరు” వంటి చిత్రాలతో టాలీవుడ్లో బలమైన స్థానం సంపాదించుకుంది. “పుష్ప” , “పుష్ప 2” ద్వారా పాన్-ఇండియా హీరోయిన్గా మరింత పేరు తెచ్చుకుంది.రష్మిక (Rashmika Mandanna) తెలిపిన ప్రకారం, తనపై వచ్చే ట్రోల్స్‌లో చాలావరకు ఉద్దేశపూర్వకమైనవే. కొందరు వ్యక్తులు, గుంపులు డబ్బులు తీసుకుని మరీ సోషల్ మీడియాలో తన గురించి నెగటివ్ పోస్టులు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ఇలా కావాలనే తన ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా రష్మిక, ట్రోలింగ్ వెనుక ఉన్న ఆర్గనైజ్డ్ ప్రణాళికలుపై దృష్టిని ఆకర్షించింది.
ట్రోలింగ్‌ల గురించి ఆవేదనను వ్యక్తం చేసింది
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రష్మిక తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ల గురించి ఆవేదనను వ్యక్తం చేసింది. నేను అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మాయిని.. కానీ అవన్నీ నేను బయట పెట్టడానికి ఇష్టపడను.అలా చేస్తే నేను కెమెరా కోసం చేశాను అని అంటున్నారు. నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు.. నా ఎదుగుదలను కావాలనే అడ్డుకుంటున్నారు. బయట జనాలు క్రూరంగా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ నన్ను బాధపెడుతున్నాయి. నాపై ప్రేమ చూపించకపోయిన పర్వాలేదు.. కానీ ప్రశాంతంగా ఉండండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రష్మిక మందన్న.
రష్మిక మొదటి సినిమా ఏది?
ఆమె మొదటి సినిమా కిరిక్ పార్టీ (2016), ఇది కన్నడ భాషలో విడుదలైంది.
తెలుగు పరిశ్రమలో రష్మిక మొదటి సినిమా ఏది?
తెలుగు లో ఆమె తొలి సినిమా ఛలో (2018).
Read hindi news: hindi.vaartha.com
Read also: