Tirumala : తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రపంచస్థాయి ఆదునీక మ్యూజియంగా అభివృద్ధిచేయాలని టిటిడి (TTD) అదనపు ఇఒ చిరుమామిళ్ల వెంకయ్యచౌదరి సూచించారు. తిరుమల ఆలయం సందర్శన అనంతరం అదే అనుభూతి భక్తులకు కలిగేలా ఇక్కడ ఆలయానికి సంబంధించిన, స్వామివారికి చెందిన అన్ని వస్తువులు ప్రదర్శన ఉండాలన్నారు. ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై (Development) మంగళవారం రాత్రి ఆయన అన్నమయ్యభవనంలో అధికారులతో కలసి సమీక్షించారు. పనులను నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలన్నారు. మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో ఐటి జిఎం ఫణికుమార్ నాయుడు, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, చీఫ్ మ్యూజియం అధికారి సోమన్నారాయణ, పిఆర్ ఒ నీలిమ తదితరులుపాల్గోన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :