తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది.

బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షం యొక్క ప్రాముఖ్యత గురించి 5 అంశాలు ఏమిటి?
వర్షాల ఉపయోగాలు
ఇది నీటి చక్రాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు అందరికీ మంచినీటిని అందిస్తుంది. అయితే, వర్షం మనకు నీటిని అందించడమే కాదు. ఇది మనపై చాలా ప్రశాంతమైన మరియు రిఫ్రెషింగ్ ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. వర్షపు చినుకుల శబ్దం చాలా విశ్రాంతినిస్తుంది మరియు వర్షపు వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: