హైదరాబాద్ Crop Loans : క్రాప్ లోన్లకు సిబిల్ స్కోర్ – రైతులకు (Farmers) మంజూరు కాని లోన్లు: రాష్ట్రంలో ఖరీప్ సాగు ముమ్మరంగా సాగుతోంది. వంటల పెట్టుబడులకు అవసరమైన రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో కొర్రి వేసి రుణాలు ఇవ్వ కుండా బ్యాంకులను రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధం గా పంట రుణాలను మంజూరు చేయాలంటే సిబిఎల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL) స్కోరు తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. అందులో మంచి పాయింట్లు ఉంటేనే పంట రుణాలు ఇస్తామని పలు బ్యాంకులు రైతాంగాన్ని ఇబ్బం దులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్త తున్నాయి. ఆర్బీఐ నిబంధన పేరుతో పంట రుణాలకు సైతం సిబిల్ స్కోర్ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోర్ కనీసం 650 నుండి 700 పాయింట్లు ఉంటేనే రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకు అధికా రులు చెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిబిల్ స్కోర్తో ప్రధానంగా చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతులు పంట రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది.
అదేవిధంగా రుణాల రికవరీలో మూడేళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తు న్నామని, ఆ రికార్డు సరిగా ఉంటే రైతులకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా రుణాలు ఇస్తున్నామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గత రుణాల చెల్లింపుల్లో ఒకటి, రెండు నెలల వ్యత్యాసం ఉన్నా రుణాలు మంజూరు చేస్తున్నామని పేర్కొంటున్నారు. చాలా మందికి ట్రాక్ రికార్డు ఉండడం లేదు. 2014లో రాష్ట్రవిభజన తర్వాత రాష్ట్రంలో రుణమాఫీ పథకం దశలవారీగా అమలు చేయడంతో పంటరుణాలు పొందిన రైతులందరికీ రుణాల మాఫీకి ఐదేళ్ల సమయం పట్టింది. ఆదేవిధంగా వడ్డీల భారమూ ఎక్కువైంది. న్నారు. దీంతో పలువురు చిన్న, సన్నకారు రైతులు వడ్డీలు చెల్లించలేక, రుణాలు రెన్యువల్ కూడా చేయిం చుకోలేకపోయారు.

దీంతో ఫెనాల్టీలు కలుపుతూ వచ్చిన బ్యాంకర్లు రైతుల ఖాతాలను డీఫాల్టర్ కింద, నిరర్థక ఆస్తుల కింద ప్రకటించారు. దీంతో ఇటీవల జరిగిన రుణమాఫీ పథకంలో సైతం ఈ రైతులపేర్లను జాబితాల్లో చేర్చకపోవడంతో వారం తారుణమాఫీ పథకానికి దూరమయ్యారు. అదే విధంగా ఈఏడాది అమలైన రుణమాఫీ పథకం సైతం విడతల వారీగా కొనసాగడంతో రైతులంతా సకాలంలో వడ్డీగానీ, అసలుగానీ చెల్లించలేదు. దీంతో రుణఖాతాల రెన్యూవల్ నిలిచిపోయింది, గత ఏడాది వరకు ఏటా రుణాలు చెల్లించిన రైతులు సైతం రుణమాఫీ జమయ్యాక బ్యాలెన్స్ ఉంటే చెల్లిద్దామనే ఆలోచనతో వేచి ఉండడంతో వారందరి సిబిల్ స్కోర్ పడి పోయింది.
దీంతో లక్ష లాదిమందిచిన్న, సన్నకారు రైతులు పంటరుణాలు పొందడానికి ఆనర్హులుగాతేలారు. బంగారం తాక ట్టుపెట్టి తీసుకునే పంట రుణాలకు సైతం సిబిల్ స్కోర్పరిగణనలోకి తీసుకుంటుం డడంతో రైతుల్లో కలవరం మొదలైంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :