విజయవాడ Free bus : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో (RTC Buses) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శక్తిపేరిట ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 కేటగిరీ బస్సుల్లో ఈ పథకం అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలానే చార్జీపై ప్రభుత్వం ఇస్తోన్న రాయితీ మొత్తాన్ని తెలుపుతూ జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ఆదేశాల్లో తెలిపింది. తిరుమల- తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఈ పథకం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.

బస్సుల్లో రద్దీగా ఉన్నప్పుడు కొందరు ప్రయానికులు ఉద్దేశపూర్వకంగా గొడవ పడినా, అమర్యాదకరంగా ప్రవర్తించినా రికార్డు (Record of behavior) చేయనున్నారు. ఏదేని ఘటనలు జరిగినా వీడియోను సమగ్రంగా విశ్లేషించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. అలానే బస్టాండ్ లో తగిన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో స్పష్టం చేసారు. ఈ పథకం పూర్తిగా అమలులో ఉంటుంది: గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్చిన్నం చేసిందని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :