తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. ఈ వివాదంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ (KTR)తీవ్రంగా స్పందించారు.

బాధ్యతారహిత వ్యాఖ్యలపై ఆగ్రహం
ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు నిరాధారమని కేటీఆర్ (KTR)తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడడం అర్థవంతమా? అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదని అన్నారు.
లీగల్ నోటీసులతో హెచ్చరిక
బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపినట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని (To apologize)నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని భవిష్యత్తులో పునరావృతం చేయవద్దని ఆయన హెచ్చరించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలంటే?
కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలను రాజకీయ ప్రయోజనాల కోసమేనని భావిస్తున్నట్టు తెలిపారు. “రాజకీయ ఉనికి కోసం ఇలా దిగజారి ఆరోపణలు చేయడం తగదు,” అంటూ ఆయన విమర్శించారు. నైతిక బాధ్యతతో వ్యవహరించాలని కేంద్ర మంత్రికి హితవు పలికారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: