అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ మీద సుంకాల దాడి చేస్తున్న సంగతి విదితమే. అంతే కాకుండా భారత(India) ఆర్థిక వ్యవస్థపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు భారతదేశాన్ని ‘టారిఫ్ కింగ్’ అంటూ పిలిచిన ట్రంప్.. మరికొన్నిసార్లు ‘డెడ్ ఎకానమీ’(Dead Economy) అంటూ విమర్శలు గుప్పించారు. అయినా సరే రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు బలంగానే ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 131.84 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇందులో భారత్ 86.51 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయగా..45.33 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది. భారతదేశం చేసిన ఎగుమతుల్లో ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు, ఐటీ ఉత్పత్తులు ఉంటే, దిగుమతులు చేసుకున్న వాటిలో ముడి చమురు, బొగ్గు, విమాన భాగాలు ఉన్నాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా అది గట్టి షాక్
అయితే ట్రంప్ కొత్తగా ప్రకటించిన 50 శాతం సుంకాలు విషయానికి వస్తే.. అందులో 25 అదనపు జరిమానాలు ఉన్నాయి. ఇవి భారత ఎగుమతులకు పెద్ద అడ్డంకి కావచ్చు. ముఖ్యంగా ఆయన తరచూ భారత్ రష్యాతో చమురు, ఆయుధాల వ్యాపారం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్ కూడా ప్రతీకారం తీర్చుకువాలనుకుంటే ఈ అమెరికన్ కంపెనీలు పెద్ద ప్రమాదంలో పడతాయి. ఈ టాప్ కంపెనీలకు పరిమితులుతో పాటు సుంకాలు విధిస్తే ఆ కంపెనీలకే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా అది గట్టి షాక్ అవుతుంది.

ఆదాయంపై తీవ్ర ప్రభావం
ఇంకా చెప్పాలంటే..అమెరికన్ కంపెనీలు భారత మార్కెట్‌లో ప్రతి రంగంలో గట్టిగా పాతుకుపోయాయి. ఈ-కామర్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్, సాంకేతికత నుంచి బ్యాంకింగ్ వరకు అన్నింటిలో ఆ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అమెజాన్ ఇండియా ఇప్పటికే దేశంలోని 97 శాతం పిన్‌కోడ్లను చేరుకుని దాదాపు ప్రతి ఇంటికి యాక్సెస్ సాధించింది. ఇక ఆపిల్ భారతదేశాన్ని ఐఫోన్‌ల కోసం వేగంగా పెరుగుతున్న మార్కెట్‌గా మలుచుకుంది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలు, సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ ద్వారా విస్తారమైన ఆదాయం భారత్ నుంచి సంపాదిస్తున్నాయి.సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ (X) వంటి ప్లాట్‌ఫామ్‌లు కోట్లాది భారతీయుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. భారత్ వీటికి ఏదైనా పరిమితి విధిస్తే.. నేరుగా ప్రకటనల ఆదాయంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
అమెరికన్ ఫైనాన్స్ రంగానికి దెబ్బ
ఇక బ్యాంకింగ్ రంగంలో సిటీ గ్రూప్ వంటి అమెరికన్ ఆర్థిక దిగ్గజాలు కోట్లాది క్రెడిట్ కార్డ్ కస్టమర్లను కలిగి ఉన్నాయి. వీటిపై నియంత్రణలు లేదా పరిమితులు విధిస్తే, నేరుగా అమెరికన్ ఫైనాన్స్ రంగానికి దెబ్బ తగులుతుంది. ఏది ఏమైనా.. డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలు భారత్‌కు సవాలు అయితే.. భారత్ తీసుకునే ప్రతీకార చర్యలు అమెరికా కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థికపరమైన నష్టాలను తీసుకువస్తాయి. భారత మార్కెట్‌లో వీటికున్న డిమాండ్ దృష్ట్యా..ఈ కంపెనీలు ఎదుర్కొనే నష్టాలు వేల కోట్ల డాలర్లుగా ఉండవచ్చు.
అమెరికాకు వెళ్లిన తొలి భారతీయుడు ఎవరు?
క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను ‘కనుగొన్న’ దాదాపు ఒకటిన్నర శతాబ్దం తర్వాత కొత్త దేశంలో అడుగు పెట్టిన మొదటి భారతీయుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన తొలి రికార్డు టామ్ అనే తూర్పు-భారతీయుడిది, అతని పేరు 1635లో వర్జీనియాలోని జేమ్స్‌టౌన్‌లోని ఒక స్థిరనివాసం యొక్క ‘ప్రధాన హక్కుదారులలో’ ఒకటిగా లెక్కించబడింది.
భారతదేశంలో ఎన్ని US వీసా రాయబార కార్యాలయాలు ఉన్నాయి?
యునైటెడ్ స్టేట్స్ రాయబార కార్యాలయం, న్యూఢిల్లీ
భారతదేశంలో అమెరికన్ కాన్సులేట్‌లు
యునైటెడ్ స్టేట్స్ ముంబై, కోల్‌కతా, చెన్నై మరియు హైదరాబాద్‌లలో కూడా కాన్సులేట్‌లను కలిగి ఉంది, ఇవన్నీ న్యూఢిల్లీలోని US రాయబార కార్యాలయానికి సంబంధించినవి. బెంగళూరు మరియు అహ్మదాబాద్‌లలో కాన్సులేట్‌లను తెరవాలనే ఉద్దేశ్యాన్ని US ప్రకటించింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :