ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ర్యాలీకి అనుమతి నిరాకరణ – పోలీసుల అడ్డగింపు
ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వరకు చేయాలని ప్రయత్నించారు. అయితే, పోలీసులు దీనికి అనుమతి లేదని స్పష్టం చేస్తూ కూటమి నేతలను ఆపారు. దీంతో పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఎన్నికల అవకతవకలపై నిరసన
ఈ ర్యాలీకి నేపథ్యం – లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వ్యవస్థపై తమ అనుమానాలను వివరించేందుకు, చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఎన్నికల సంఘాన్ని కలవాలనుకున్నారు.
బారికేడ్లు దాటి నిరసన
ఎన్నికల సంఘం భేటీకి 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, “మేమంతా కలిసే వెళతాం” అంటూ ఎంపీలు పట్టుదలగా ముందుకు సాగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటి రోడ్డుపై బైఠాయించారు. దీంతో, వారిని పోలీసులు ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు
ఈ అరెస్టులతో దేశ రాజధానిలో రాజకీయ వేడి పెరిగింది. విపక్షాలపై ప్రభుత్వం దుర్బల చర్యలు తీసుకుంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విపక్షాలు మండిపడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: