దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్యపై ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

వీధి కుక్కలను వెంటనే తరలించాలి – కోర్టు ఆదేశం
సోమవారం నాడు జస్టిస్ జేబీ పార్థీవాలా (Justice JB Parthiwala), జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న కుక్కల వల్ల ప్రజల జీవితం ప్రమాదంలో పడుతోందని పేర్కొంటూ, వాటిని వెంటనే పట్టుకొని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలి అని స్పష్టం చేసింది.
అడ్డుతగిలిన వారిపై ధిక్కరణ చర్యలు తప్పవు
ఈ ప్రక్రియకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరించినా లేదా అడ్డుపడినట్లయితే, కోర్టు ధిక్కరణగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. “ఇది భావోద్వేగాలకు సంబంధించింది కాదు, ప్రజల భద్రతే ప్రాధాన్యం” అని ధర్మాసనం పేర్కొంది.
జంతు ప్రేమికుల అభ్యర్థనలకు తావు లేదు
వీధి కుక్కల (Street dogs) తరలింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేసే జంతు హక్కుల సంఘాల పిటిషన్లను ఈ దఫా స్వీకరించబోమని కోర్టు స్పష్టం చేసింది. “కొంతమంది జంతు ప్రేమికుల భావోద్వేగాల కోసం మన పిల్లల ప్రాణాలను త్యాగం చేయలేం,” అని ధర్మాసనం ఖచ్చితంగా వెల్లడించింది.
ప్రత్యేక షెల్టర్లు, సీసీటీవీలు, హెల్ప్‌లైన్ అవసరం
కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటుచేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కుక్కలు తిరిగి వీధుల్లోకి రావకుండా సీసీటీవీలు, మరియు బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించింది. అవసరమైతే ప్రత్యేక దళం ఏర్పాటు చేయవచ్చని కోర్టు తెలిపింది.
రేబిస్, కుక్కకాటు ఘటనల గణాంకాలు
2025 జనవరి నుండి జూన్ మధ్యలో మాత్రమే 35,198 కుక్కకాటు ఘటనలు మరియు 49 రేబిస్ కేసులు ఢిల్లీలో నమోదవడంతో, కోర్టు తక్షణ చర్యలను తగినవిగా పరిగణించింది. ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడటమే ప్రాథమిక కర్తవ్యం అని స్పష్టం చేసింది.
ఏ కుక్కను తిరిగి వీధుల్లో వదలకూడదు
అంతేగాక, షెల్టర్లకు తరలించిన కుక్కలను తిరిగి వీధుల్లోకి వదలకూడదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడిన వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: