తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి కొత్త సినిమా విడుదలే ఒక పండుగలా మారిపోతుంది. ఇప్పుడు ఆయన తాజా చిత్రం “కూలి” ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆనందం అలముకుంది. ఈ సినిమా రాబోతుందనే వార్త వచ్చిన నాటి నుంచే రజనీ అభిమానులు సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద ప్రత్యేక హంగామా చేస్తూ ఉంటారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తోంది.ఈ సినిమాపై భారీ అంచనాలకు ప్రధాన కారణం దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఖైదీ, విక్రం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్, రజనీతో కలిసి పనిచేస్తున్నాడంటే అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువ కావడం సహజం. ఆయన రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉంటాయని టాక్.”కూలి” టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఊహించని స్థాయిలో సాగుతున్నాయి. చెన్నైతో పాటు పలు నగరాల్లో మొదటి రోజు అన్ని షోలు ‘సోల్డ్ అవుట్’ అయ్యాయి.
జనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
తమిళనాడులో తెల్లవారుజామున ప్రత్యేక ప్రదర్శనలకు నిషేధం ఉండటంతో, అనేక మంది అభిమానులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఫస్ట్ షో చూడాలని ప్లాన్ చేస్తున్నారు. ఏపీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే రజనీ సినిమాకు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసే పనులు మొదలయ్యాయి.రజనీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సాధారణ ప్రేక్షకుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు వరకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్‌లో కూడా రజనీకాంత్ (Rajinikanth) అభిమానుల సంఖ్య ఎక్కువే. ప్రముఖ క్రికెటర్ సంజు శాంసన్ కూడా రజనీకి వీరాభిమాని కావడం విశేషం. కేరళలో పుట్టి పెరిగిన సంజు, చిన్నప్పటి నుంచే రజనీ సినిమాలు చూసి పెరిగాడు.క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌పై తన అభిమానం గురించి సంజు శాంసన్ మాట్లాడాడు.
నాకు రజనీ అంటే ఎంత ఇష్టమో దీనిని బట్టి అర్థం చేసుకోండి
ఒకసారి ఐర్లాండ్‌లో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, మరుసటి రోజు తనకు ఒక ముఖ్యమైన మ్యాచ్ ఉన్నప్పటికీ, రజనీకాంత్ సినిమా విడుదలైనందున ఒంటరిగా సినిమా చూడటానికి వెళ్లినట్లు సంజు శాంసన్ తెలిపాడు. డబ్లిన్‌లో థియేటర్ ఎక్కడుందో వెతికి, టికెట్ కొనుక్కుని సినిమా చూసి వచ్చినట్లు చెప్పాడు. “నాకు రజనీ అంటే ఎంత ఇష్టమో దీనిని బట్టి అర్థం చేసుకోండి” అని సంజు శాంసన్ (Sanju Samson) అన్నాడు. “నేను పెద్ద రజనీ అభిమానిని. ఆయన సినిమా విడుదలైన మొదటి రోజే చూసేస్తాను. ఒకసారి మేము ఐర్లాండ్లో క్రికెట్ ఆడటానికి వెళ్లాం. మరుసటి రోజు నాకు క్రికెట్ మ్యాచ్ ఉంది. కానీ ఆ రోజు రజనీ సినిమా విడుదలైంది. నేను సినిమా చూడాలనే ఉద్దేశంతో హోటల్ నుండి బయలుదేరి ఒంటరిగా వెళ్ళిపోయాను. డబ్లిన్లో థియేటర్ ఎక్కడ ఉందో వెతికి, అక్కడ రజనీ సినిమా ఆడుతుందో లేదో తెలుసుకుని, టికెట్ తీసుకుని సినిమా చూసి వచ్చాను. అప్పుడు మీరు అర్థం చేసుకోండి, నాకు రజనీ అంటే ఎంత ఇష్టమో” అని సంజు శాంసన్ చెప్పాడు. కూలి సినిమాపై అభిమానుల మధ్య అంచనాలు పెరిగిన సమయంలో సంజు శాంసన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంజు శాంసన్ ఎక్కడ పుట్టారు?
ఆయన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పుట్టారు.
సంజు శాంసన్ భారత జట్టులో ఏ ఫార్మాట్‌లలో ఆడుతున్నారు?
ఆయన ప్రధానంగా వన్డే మరియు టీ20 ఫార్మాట్‌లలో భారత జట్టులో ఆడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: