లోన్ యాప్ల మోసాలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొబైల్లో సులభంగా అందుబాటులో ఉండే ఈ యాప్ (App) ల ద్వారా తక్కువ సమయంలో డబ్బు వస్తుందని ఆశపెట్టించి, చివరికి ప్రజలను కుంగదీసే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల తరఫున ఎన్నిసార్లు హెచ్చరికలు వచ్చినా, ఈ మోసగాళ్ల వలలో పడి ప్రాణాలు కోల్పోతున్న వారు తక్కువ సంఖ్యలో లేరు. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన ఈ విషయం మరోసారి రుజువు చేసింది.నల్లగొండ జిల్లా కనగల్ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎర్రవెల్లి యాదగిరిరెడ్డి పెద్ద కుమారుడు ఎర్రవెల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి (27) దివ్యాంగుడు. నల్లగొండలోని దివ్యాంగుల వసతి గృహంలో ఉంటూ సిద్దార్థ కళాశాల (Siddhartha College) లో పీజీ చదువుతున్నాడు. చదువు, వ్యక్తిగత అవసరాల నిమిత్తం కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన వారం రోజుల క్రితం ఇంటర్నెట్ ద్వారా ఓ లోన్ యాప్ నిర్వాహకులను సంప్రదించాడు.

ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది
తమ అకౌంట్కు రూ.1.27లక్షలు పంపిస్తే వెంటనే రూ.6.27లక్షలు ఖాతాలో జమ చేస్తామని యాప్ నిర్వాహకులు నమ్మబలికారు. యాప్ నిర్వాహకుల మాయ మాటలను నమ్మిన ప్రవీణ్ రెడ్డి.. స్నేహితులు, బంధువుల వద్ద రూ.1.27 లక్షలను అప్పు చేసి యాప్ నిర్వాహకుల అకౌంట్కు పంపాడు. అయినా యాప్ నిర్వాహకుల నుండి ఎలాంటి సమాధానం రాకపోగా లోన్ డబ్బులను కూడా అకౌంట్లో వేయలేదు.దీంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి.. యాప్ నిర్వాహకులను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో లోన్ యాప్ నిర్వాహకులతో మోసపోయానని భావించి ప్రవీణ్ కుమార్ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడు. నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ సమీపంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్లో ఎలాంటి వాగ్గానాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
లోన్ యాప్ స్కామ్లలో మోసం ఎలా జరుగుతుంది?
మొదట చిన్న మొత్తంలో రుణం ఇస్తారు. అప్పు తిరిగి చెల్లించకముందే అధిక వడ్డీలు, జరిమానాలు వేసి, తిరిగి చెల్లించలేనంత మొత్తం డిమాండ్ చేస్తారు.
లోన్ యాప్ స్కామ్ అంటే ఏమిటి?
లోన్ యాప్ స్కామ్ అనేది కొన్ని నకిలీ లేదా అనధికారిక రుణ యాప్లు అధిక వడ్డీలు వసూలు చేస్తూ, ప్రజలను మోసం చేసే ఒక రకమైన ఆన్లైన్ మోసం. వీటిలో రుణం తీసుకున్న తర్వాత దాచిన ఛార్జీలు, బెదిరింపులు, వ్యక్తిగత వివరాల దుర్వినియోగం జరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: