మన దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాపితంగా గొప్ప విలువ వుంది. బయటి దేశాల వారికి మన గురించి, మన పద్దతుల గురించి తెలీదు కాబట్టి.. అందులో పెద్దగా బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. కానీ, సొంత దేశంలో కూడా దుస్తుల కారణంగా అవమానాలు ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయు దుస్తులు వేసుకుంటే లోపలికి అనుమతించని హోటళ్లు చాలానే ఉన్నాయి.
హోటల్ సిబ్బందితో జంట గొడవ
తాజాగా, హోటల్‌కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. పంజాబీ డ్రెస్(Punjabi Dress) వేసుకుందన్న కారణంతో ఓ మహిళను హోటల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ(Delhi) కి చెందిన ఓ జంట పీతమ్‌పురలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే, మహిళ పంజాబీ డ్రెస్ వేసుకుందన్న కారణంతో రెస్టారెంట్ లోపలికి అనుమతి నిరాకరించారు. దీంతో ఆ జంట హోటల్ సిబ్బందితో గొడవకు దిగింది. ఈ సందర్భంగా ఆ జంట మాట్లాడుతూ..‘భారతీయ దుస్తులు ధరించిన కారణంగా మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదు. మేనేజర్ మాతో తప్పుగా ప్రవర్తించాడు. ఇలాంటి హోటల్ని మూసి వేయాలి’ అంటూ ఫైర్ అయ్యారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా స్పందించారు. సంఘటనపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరో పోస్టులో .. ‘ఇకపై ఆ రెస్టారెంట్ దుస్తుల ఆధారంగా ఎంట్రీని నిర్ణయించదు. భారతీయ దుస్తుల్లో వెళ్లినా స్వాగతం పలుకుతుంది. రక్షా బంధన్ సందర్భంగా అక్కచెల్లెళ్లకు డిస్కౌంట్ కూడా ఇస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే, రెస్టారెంట్ ఓనర్ ఆ జంట వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘వాళ్లు హోటల్‌లో సీట్లు బుక్ చేసుకోలేదు. మా దగ్గర దస్తులపై బ్యాన్ పాలసీ లేదు. అందరినీ స్వాగతిస్తాం’ అని అన్నారు.
తాజ్ హోటల్ చరిత్ర ఏమిటి?
తాజ్ హోటల్స్
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్సెట్జీ నుస్సేర్వంజీ టాటా, ముంబైలో (గతంలో బొంబాయి అని పిలుస్తారు) అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న తాజ్ మహల్ ప్యాలెస్ అనే హోటల్‌ను డిసెంబర్ 16, 1903న ప్రారంభించారు.
భారతదేశంలో మొట్టమొదటి హోటల్ ఏది?
గ్రేట్ ఈస్టర్న్ హోటల్, కోల్‌కతా
Read hindi news: hindi.vaartha.com
Read Also :