ఒబిసిల డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వినతి
హైదరాబాద్ : జాతీయస్థాయిలో ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం(Central Govt) దృష్టికి తీసుకువెల్లి బిసి డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని గోవా గవర్నర్ పి. అశోక్ గజపతిరాజును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు(Srinivasa goud, Shankarao) విజప్తి చేశారు. శుక్రవారం గోవా రాజభవన్లో గవర్నర్గా నియ మితులైన అశోక్ గజపతిరాజుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అంద జేశారు. అనంతరం బిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్కు ఇచ్చారు. 2026 సంవత్సరం నుండి దేశవ్యాప్తం గా చేపట్టబోయే జనగణనలో సమగ్ర కులగనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణహించిందని దీనిని దేశంలోని బీసీలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.

మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట
ఇదే సందర్భంలో బిసిల కు చట్టసభలో జనాభా దా మాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల కల్పన, మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోటా, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 పరిమితిని ఎత్తివేసి బీసీ లకు జనాభా దామాషా ప్రకారం విద్యాఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా బిసిల సమస్యల ను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తప్పకుండా తీసుకెళ్లి, బీసీ డిమాండ్ల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలి పారు. గవర్నర్ను కలిసిన బృందంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ఏపీ ప్రధాన కార్య దర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, నేతలు నరేష్ ప్రజాపతి, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, బాలగుండ్ల శ్రీనివాసరావు, పూర్ణ, కాశి, హనుమంతరావు, వేముల కృష్ణ, వెంకటరావు, సతీష్ పాల్గొన్నారు.
అదితి విజయలక్ష్మి గజపతి రాజుపుష్ప ఎవరు?
పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు (జననం 1983) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె విజయనగరం జిల్లాలోని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటిసారి సభ్యురాలు. ఆమె తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది.
అశోక్ గజపతి రాజు మొదటి భార్య ఎవరు?
ఆయన 1974లో సునీలను వివాహం చేసుకున్నారు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిలో ఒకరు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అయిన పూసపాటి అదితి విజయలక్ష్మి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :