వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, రాబోయే నాలుగు రోజులు దక్షిణ తెలంగాణ (South Telangana) ను భారీ వర్షాలు తాకే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు మరింతగా ప్రభలనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
వర్షాల ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ (IMD) వనపర్తి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూలు, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అవసరం లేనంత వరకు బయటకు వెళ్లకూడదని సూచనలిచ్చింది.
హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు కూడా వర్ష సూచనలు ఉన్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణాలు, ట్రాఫిక్‌పై ప్రభావం పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా తక్కువ ప్రదేశాల్లో నివసించే వారు, రైతులు, ప్రయాణికులు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: