ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) కు చెందిన కేఫ్ మరోసారి లక్ష్యంగా మారింది. కెనడాలోని సుర్రే నగరంలో ఉన్న ‘క్యాప్స్ కేఫ్’ (‘Caps Cafe’) పై గురువారం తెల్లవారుజామున దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ నెలలో ఇదే కేఫ్‌పై ఇది రెండోసారి దాడి జరగడం గమనార్హం. జూలై 10న మొదటి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే స్థలంపై తీవ్రంగా కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.కాల్పుల ఘటనకు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ముఠాలే బాధ్యత వహిస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ దాడి ఒక హెచ్చరిక మాత్రమేనని, తదుపరి టార్గెట్ ముంబయి అని స్పష్టం చేశారు.

4:40 గంటల సమయంలో కాల్పులు
గురువారం తెల్లవారుజామున 4:40 ప్రాంతంలో కాల్పులు మొదలయ్యాయి. స్థానికులు భయాందోళనకు లోనై పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కేఫ్ కిటికీలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ అక్కడ ఉన్న సిబ్బందికి ఎలాంటి హానీ జరగలేదు. కేఫ్ బయట ఒక పెట్రోల్ బాంబు కూడా గుర్తించారు. దాన్ని ఫోరెన్సిక్ పరిశీలన కోసం స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో దుండగులు 25 రౌండ్లు కాల్పులు జరుపుతున్నట్టు కనబడుతోంది. టార్గెట్ స్పందించకపోవడంతో తాము కాల్పులు జరిపామని వీడియోలో చెప్పారు.
భద్రతా శాఖల అలర్ట్
ముంబయిలోని పోలీసులతో పాటు ఇతర భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇది అంతర్జాతీయ గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న కుట్రగా భావిస్తున్నారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.జూలై 10న జరిగిన మొదటి దాడికి ఖలిస్థానీ ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ బాధ్యత వహించింది. కపిల్ శర్మ షోలో సిక్కుల పట్ల చేసిన వ్యాఖ్యలకే ప్రతీకారం తీసుకున్నట్టు ప్రకటించారు.
కేఫ్ యాజమాన్యం స్పందన
ఈ దాడులపై క్యాప్స్ కేఫ్ యాజమాన్యం స్పందించింది. తమ కేఫ్ ఆత్మీయతను, సాహసాన్ని ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. హింసతో ఒప్పుకోమని, న్యాయ మార్గాల్లో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు కృషి జరుగుతోంది. రెండు దాడులకూ సంబంధిత దృశ్యాలు పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also : Haider Ali : హైదర్ అలీ అరెస్ట్ : హైదర్ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న యూకే పోలీసులు