హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దుష్ప్రచారం చేసుకుంటుందో రాష్ట్రంలోని బిసిలు అన్నీ గమనిస్తున్నారని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ (Payal Shankar) పేర్కొన్నారు. బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ను (Kamareddy Declaration) అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదన్నారు ఈ విషయాన్ని శాసనసభలో బిల్లు పెట్టిన సందర్భంలోనే మేము స్పష్టంగా చెప్పామని, బిసి రిజర్వేషన్ల బిల్లు పెట్టినట్టే పెట్టి, ముస్లింలను బిసి రిజర్వేషన్లలో చేర్చి, ఆ బిల్లును సమర్థించకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు.

10 శాతం ముస్లింలకు కేటాయించడం వల్ల బిసిలకు ఏమి లేదు
ఇక్కడ బిల్లు పెడతారు, భవిష్యత్తులో ఢిల్లీలో ధర్నా చేస్తారు అని అప్పుడే చెప్పానని అన్నారు. మేము చెప్పినదే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న నాటకాల రూపంలో నిజమవుతుందని, శాసనసభలో ముస్లింలు లేనట్లుగా 42 శాతం బిసిలకు రిజర్వేషన్లు (Reservations for BCs) ఇస్తామా అనే ప్రశ్నకు ఇప్పటికీ కాంగ్రెస్ సమాధానం ఇవ్వలేదన్నారు. ముస్లింలకు 10 శాతం కట్టబెట్టాలన్న ఆలోచనతోనే నడుస్తుందని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి, ఇప్పుడు 42 శాతం పేరుతో రిజర్వేషన్లు పెరిగినట్లు చెప్పి, అందులో 10 శాతం ముస్లింలకు కేటాయించడం వల్ల బిసిలకు మిగిలేది 32 శాతమే అన్నారు. అంటే 2014లో ఉన్న 34 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు 32 శాతానికి తగ్గుతున్నాయని, ఇది ఏ రకమైన వ్యవహారమో ఈరోజు రాష్ట్రంలో బిసిలు అర్థం చేసుకున్నారన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి రూ.20,000 కోట్ల బిసి సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తామని చెప్పారు. రెండు బడ్జెట్లు పూర్తయ్యినా, నయాపైసా కూడా విడుదల కాలేదు. 50 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక బిసిని ప్రధాని చేయాలన్న ఆలోచన చేసిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి అయినా బిసిని ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. నాలుగు ముఖ్యమంత్రులను మార్చినప్పుడు, ఒక్కసారి అయినా బిసికి అవకాశం ఇవ్వలేదన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: