క్రిమినల్ కేసులు పెట్టినా దారికిరాని మిల్లర్లు
153 రైసు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు
హైదరాబాద్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానంలో ధాన్యాన్ని బియ్యంగా చేసి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కు అప్పగించడంలో తెలంగాణలోని మిల్లర్లు ఎడతెగని జాప్యం చేస్తూనే ఉన్నారు. మిల్లర్లు, ఏజెన్సీ ల మధ్య సయోధ్య లేకపోవడంతో రికవరీ కావడం లేదు. గడువు ముగిసినా ధాన్యం అప్పగించలేదు. 2022-23 యాసంగిలో సిఎంఆర్ ను సకాలంలో ఇవ్వలేదు. దీంతో సర్కారు అప్పటి ధాన్యం నిల్వలనువేలం పద్ధతిలో కొన్ని ఆ తర్వాత అనేక ఏజెన్సీలకు అప్పగించింది. వారి ద్వారా బియ్యం తిరిగి సేకరించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. అనేక సార్లు గడువు పెంచుతూ వచ్చారు. జూన్ నెలలోగా బియ్యం అప్పగించాలని ఆదేశించినా రాష్ట్రంలో రెండువేల కోట్ల పైచిలుకు బియ్యం ప్రభుత్వం కు రాలేదు.
విలువైన ధాన్యం
సిఎంఆర్, ధాన్యంబకాయిల రికవరీపై అధికా రులు అయోమయంలో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు. వారి నుంచి సరైన స్పందన, దిశానిర్దేశం కొరవడటంతో ఏటా రూ.వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లుల్లోంచి అక్రమంగా తరలుతోంది. సిఎంఆర్ లక్ష్యం కొండలా పేరుకుపోతోంది. ఈఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసేనాటికైనా ధాన్యం, సిఎంఆర్ బకాయిల లెక్క కొలిక్కి వస్తుందా? అనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి సుమారు పదహారు వందల కోట్ల బకాయిలు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన వడ్ల నిల్వలను బియ్యంగా మార్చి ఎప్పుడో పక్కదారి పట్టించడంతో వేలం ధాన్యంను అందించలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన
ప్రభుత్వం గడువు ఇచ్చిన జూన్ 10తో ముగిసింది. అధికారులు రికవరీ యాక్టు కింద కఠిన చర్యలు చేపట్ట కుండా నోటీసులతో సరిపెడుతున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను బియ్యం చేసి ఇవ్వడానికి ప్రభుత్వం మిల్లర్లకు కేటాయిస్తోంది. రైస్ మిల్లులు క్వింటాకు 67 కిలోల బియ్యం తిరిగి అప్పగిం చాలి. మహబూబ్ నగర్ (Mahabubnagar) ఉమ్మడి జిల్లాలో 86520 మెట్రిక్ టన్నెల్ బకాయి కి గాను జూన్ 10 గడువులోగా 15శాతం అప్పగించారు. మిల్లర్లు అప్పగించింది పోనూ ఇంకా ఇవ్వాల్సిన ధాన్యం5,04,399 మెట్రిక్ టన్నులు. వాటి విలువ రూ.985.19 కోట్లు. ఇందులో వనపర్తి జిల్లా మిల్లర్ల నుంచి రూ.421.77 కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 5. 222.19 5 మహబూబ్నగర్ జిల్లాలో రూ.141.17కోట్లు, నారయణపేటలలో రూ.136.18 కోట్లు జోగులాంబ గద్వాలలో 63.88 కోట్లు రావాల్సి ఉంది.
ధాన్యం బకాయిలు వసూలు కోసం
కరీంనగర్ జిల్లాలో 218511 మె.ట ధాన్యం బకాయి ఉండగా 124660 మె.ట మాత్రమే తిరిగి రాబట్టినారు. ఇంకా 93844మె.టధాన్యం బకాయి రావాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ, సిఎంఆర్ బకాయిలు రూ.300 కోట్లు పేరుకుపోయాయి. రైసు మిల్లర్ల మాయాజాలానికి ప్రభుత్వం చిత్తవుతోంది. ధాన్యం బకాయిలు వసూలు కోసం క్రిమినల్ కేసులు (Criminal cases) పెట్టినా మిల్లర్లు దారికి రావడంలేదు. తెలంగాణ వ్యాప్తంగా 153 రైసుమిల్లు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఇంకా రూ.2359.61కోట్ల విలువగలిగిన ధాన్యం చెల్లించడంలేదు, ప్రభుత్వ ఆదేశాల మేర కు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించడమే కాకుండా 25 జిల్లాలోని రైసుమిల్లులపై కేసులు నమోదు చేవారు. నిజామాబాద్ జిల్లాలో 48 మంది మిల్లర్లు రూ. 270 కోట్ల సీఎంఆర్ బకాయిపడ్డారు. వీరిలో 32 మంది కోర్టులను ఆశ్రయించారు.

ప్రజాప్రతినిధికి
జిల్లాలో సిఎంఆర్ తో పాటు వేలం ధాన్యం బకాయిలు మొత్తం రూ.570 కోట్ల వరకు ఉండటం గమనార్హం. గత పదేళ్ల నుంచి ఈ విషయమై మిల్లర్లపై కేసులు నమోదు చేస్తూ వస్తున్నా. తదనంతరం చర్యలు ఉండటం లేదు. “2024-25″ వానాకాలం సంబంధించి 34 శాతం, రబీ సీజన్లో 28 శాతం సిఎంఆర్ మాత్రమే అందింది. ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన మిల్లుల నుంచి రూ.60 కోట్ల విలువ చేసే బియ్యం రెండేళ్లు దాటినా అందలేదు. ఈ నేపథ్యంలో అధికారులు రూ.10 కోట్ల జరిమానా విధించారు. అయినా ఎలాంటి స్పందన లేదు. భద్రాద్రి కొత్తగూడెంలో 1 రైసుమిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జాప్యం చేసే వారికి భవిష్యత్తులోనూ
హనుమకొండ జిల్లాలో 11, జగిత్యాల 4, జనగామ2, జయశంకర్ భూపాలపల్లి 2, జోగులాంబగద్వాల 3, కామరెడ్డి2, కరీంనగర్ 4, ఖమ్మం1, మహబూబాబాద్ 4, మంచిర్యాల1, మెదక్12, ములుగు1, నాగర్కర్నూల్ 6, నల్లగొండ3, నారాయణపేట6, నిర్మల్7, నిజామాబాద్20, పెద్దపల్లి 4, రంగారెడ్డి1, సిద్దిపేట 5, సూర్యపేట 11, వనపర్తి 16, వరంగల్ 25, యాదాద్రి భువనగిరి 1 చొప్పన కేసులు నమోదైనాయి. సిఎంఆర్ ఇవ్వడంలో జాప్యం చేసే వారికి భవిష్యత్తులోనూ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అలాంటి వారికి ధాన్యం కేటాయింపులు సైతం ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. రైసిమిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో మిల్లుల రైస్ మిల్లుల యాజమాన్యాల్లో వణకుమొదలైంది. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 25 రైసుమిల్లులపై క్రిమినల్కేసులు నమోదు కాగా, రెండోస్థానంలో నిజామాబాద్ రైసుమిల్లర్లు నిలిచిఉన్నారు. వనపర్తి 16కేసులతో మూడో స్థానంలో ఉంది. మెదక్, హనుమకొండ, సూర్యాపేటలో 11 చొప్పన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
బియ్యం అంటే ఏమిటి?
బియ్యం అనేది ధాన్యం నుండి తీసే ప్రధాన ఆహార ధాన్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ముఖ్యమైన ఆహార పదార్థంగా వినియోగించబడుతుంది, ముఖ్యంగా ఆసియా దేశాలలో.
బియ్యం లో ఏ ఏ పోషకాలు ఉంటాయి?
బియ్యంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు (శక్తినివ్వే పదార్థం), కొద్దిగా ప్రోటీన్లు, బి విటమిన్లు (B1, B3), కొంతమేర మినరల్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: