అమెరికాలో గ్రీన్ కార్డు (Green card) కోసం సంవత్సరాలుగా వేచి చూస్తున్న వలసదారులకు శుభవార్త. అక్కడి ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోంది, దీని ద్వారా నిర్దిష్ట ఫీజు చెల్లించే దరఖాస్తుదారుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించనుంది. ఈ చర్యకు సంబంధించిన ప్రతిపాదనలు “డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025” (Dignity Act of 2025) అనే బిల్లులో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బిల్లును చట్టసభల ముందుకు తీసుకురానున్నారు.

గ్రీన్ కార్డు ఆలస్యం – ప్రధానంగా ఏ దేశాలవారికే?
అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటున్న లక్షలాది మంది భారతీయులతో పాటు, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాల పౌరులు శాశ్వత నివాసానికి (Green card) సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ దేశాల నుంచి వలసలు అధికంగా ఉండటం, వార్షిక కోటా పరిమితులు ఉండటంతో ఈ ఆలస్యం మరింత పెరిగుతోంది.
డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025: ఫాస్ట్ ట్రాక్ గ్రీన్ కార్డుల కోసం కొత్త మార్గం
ఈ సమస్యకు పరిష్కారంగా అమెరికా ప్రభుత్వం “ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ” (Premium processing fee) విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. సుదీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారు $20,000 (ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹17 లక్షల వరకు) చెల్లిస్తే, వారి దరఖాస్తును అధికారులు ప్రాధాన్యతతో పరిశీలించనున్నారు. ఈ మేరకు బిల్లును సమర్పించిన సెనేటర్ మారియా ఎల్విరా సలజార్ మాట్లాడుతూ, ఇది వలసదారులకు ఊరట కలిగించే మార్గమని చెప్పారు.
గ్రీన్ కార్డు కోటా – ప్రస్తుత పరిస్థితి మరియు ప్రతిపాదిత మార్పులు
ప్రస్తుతం, ఒక్కో దేశానికి గ్రీన్ కార్డుల వార్షిక కేటాయింపు 7% మాత్రమే. ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కోటాలో 2,26,000 కార్డులు, ఉపాధి ఆధారిత కోటాలో 1,40,000 కార్డులు జారీ చేయబడతాయి. అయితే, దరఖాస్తుదారుల సంఖ్య అధికంగా ఉండే దేశాలకు ఇది అందుకే తాజా బిల్లులో ఈ దేశాల కోటాను 15 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: