ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ లోక్‌సభ(లో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని.. బీజేపీ కోసం ఈసీ(EC) ఓట్లను దొంగిలించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్‌పోల్స్‌కు , ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉందని.. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు. ఢిల్లీలో గురువారం రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత భారీగా పోలింగ్ నమోదయ్యిందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షల రహస్య ఓటర్లను చేర్పించారని పేర్కొన్నారు.

ఒకే ఓటరు పేరు నాలుగు పోలింగ్ బూత్‌ల్లో..
ఎలక్ట్రానిక్ డేటాను ఈసీ తమకు ఇవ్వడం లేదని.. ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఐదు వేర్వేరు తేదీల్లో ఈసీ ఓట్లను దొంగిలించిందన్నారు. కర్నాటకలోని మహదేవ్‌పూర్‌లో కూడా ఓట్లను దొంగిలించారన్నారు. ఒకే ఓటరు పేరు నాలుగు పోలింగ్ బూత్(Poliing Booth)ల్లో చేర్పించారని.. 11 వేల మంది పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నట్టు చూపించారని.. మహదేవ్‌పూర్‌లో 11965 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒకే ఓటరు నాలుగు రాష్ట్రాల్లో ఓటేశాడని.. ఒకే ఓటరుకు కర్నాటక, మహారాష్ట్ర, యూపీలో ఓటుహక్కు ఉందని.. తెలిపారు. మహదేవ్‌పూర్‌లో లక్షా 250 ఓట్లు దొంగిలించారు.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ జీవిత చరిత్ర ఎవరు?
రాహుల్ గాంధీ 19 జూన్ 1970న పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ దంపతుల ఇద్దరు పిల్లలలో ఆయన మొదటి సంతానం. ఆయన కుటుంబం భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటంలో ప్రసిద్ధి చెందింది. ఆయన తండ్రి తరువాత భారత ప్రధానమంత్రి అయ్యారు.
సోనియా గాంధీ ఏ మతం?
ప్రారంభ జీవితం. సోనియా మైనో డిసెంబర్ 9, 1946న ఇటలీలోని వెనెటోలోని విసెంజా నుండి 35 కి.మీ దూరంలో ఉన్న చారిత్రాత్మకంగా సింబ్రియన్ మాట్లాడే గ్రామమైన లూసియానా (మైని వీధిలోని)లో స్టెఫానో మరియు పావోలా మైనో దంపతులకు జన్మించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: