మహబూబ్ నగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంపై జస్టిస్ పిసి గోష్ కమిషన్ రిపోర్ట్ పై బయట చర్చలు చేయడం కాదు అసెంబ్లీలో చర్చలు జరగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెం కటరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని గౌడ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభల్లో చాడ వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై గోష్ కమిషన్ రిపోర్ట్ పై మంత్రి వర్గం సమావేశమై చర్చించి ఈ అంశంపై అసెం బ్లీలో చర్చించాలని తీర్మానం చేయడం జరిగిం దన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై తీర్మానం చర్చల్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తప్పనిసరిగా పాల్గొని వాస్త వాలను ప్రజలకు తెలపాలని అన్న మంత్రివర్గం ఆమోదం లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరిగిం దని కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయిందా అని, కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని బయట రకరకాల చర్చలు జరుగుతున్నాయని బయట చర్చలు కాదు, అసెంబ్లీలో చర్చలు చేస్తే ప్రజలు ఎవరు ఏంటి అనేది గుర్తిస్తారని అన్నారు. బీసీలకు 42 రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఢిల్లీలో చేస్తుంది ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వంకూడా ఈ అంశంపై నాన్చకుండా త్వరగా ఆమోదం తెలపాలన్నారు. సినీ కార్మికు లకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తున్నామని మొండిగా వ్యవహరిస్తున్న నిర్మాతల మండలిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలని ఆయన డిమాండ్చేశారు. సినీ కార్మికుల సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :