చాలా సంవత్సరాలుగా తమకో సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న కర్నూలు గూడెంకొట్టాల (Gudemkottala) ప్రాంత వాసుల కల చివరకు నెరవేరింది. నాలుగు దశాబ్దాల కష్టాలు ముగిసిపోయిన ఈ సంఘటన, అక్కడి పేదల జీవనంలో కొత్త ఆశను నింపింది. 150 నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందడంతో సొంత ఇల్లు కల నెరవేరింది. గత 40 ఏళ్లుగా పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తూ శాశ్వత నివాస హక్కు కోసం ఎదురుచూస్తున్న ఈ కుటుంబాలకు ఎట్టకేలకు పట్టాలు లభించాయి.

‘యువగళం’ హామీకి న్యాయం
నారా లోకేశ్ (Nara Lokesh) తన యువగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు వచ్చిన సమయంలో, స్థానిక వాసులు తమ గోడును ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి టీజీ భరత్ (In-charge TG Bharat) ఆధ్వర్యంలో గూడెంకొట్టాల ప్రజలు లొకేశ్ (Nara Lokesh)ను కలిసి తమ సమస్యలను వివరించారు.
ప్రభుత్వ స్థలాన్ని పేదలకు కేటాయింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు చేపట్టారు. 2025 జనవరిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.30 ద్వారా, విలువైన ప్రభుత్వ భూమిని ఈ నిరుపేద కుటుంబాలకు కేటాయించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ పట్టా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది స్వర్గతుల్యంగా మారింది.
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ – ఆనందంతో ప్రజలు
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వయంగా లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను అందించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరిందంటూ లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నేరవేర్చడం ద్వారా ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: