हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

A Great Teacher:మంచి మాస్టార్.

Hema
A Great Teacher:మంచి మాస్టార్.

A Great Teacher:రామాపురం అనే ఊరిలో సన్యాసి రావు అనే రైతు తన కుటుంబంతో నివసించేవాడు. సన్యాసిరావుకి ఒక కుమారుడు. పేరు ప్రవీణ్, 7వ తరగతి చదువుతున్నాడు. ప్రవీణ్ చదివే స్కూల్లో ప్రసాదు మాస్టారు ఎప్పుడు రకరకాల వేషాలు వేసుకుని నాటకాలు వేస్తూ పిల్లలను అలరించేవారు. అందుకే పిల్లలందరూ ప్రసాద్ మాస్టారు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవారు.

కానీ ప్రవీణ్ మాత్రం దానికి భిన్నం. ప్రవీణ్ అందరికంటే తెలివైన (intelligent) వాడే కానీ తన మీద తనకి నమ్మకం తక్కువ. అది గమనించిన ప్రసాద్ మాస్టారు ప్రవీణ్ మనసులో ఆత్మస్థైర్యం నింపటానికి విశ్వప్రయత్నాలు చేసేవారు. అయినా ప్రవీణ్ మార్పురాలేదు. ప్రవీణ్ తల్లి (mother) అనసూయమ్మ ప్రవీణ్ భయం పోగొట్టేందుకు హోమాలు చేయించింది.

దీన్ని గమనించిన సన్యాసిరావు అనసూయమ్మతో “ఇదిగో ఏమే! అడవి నుంచి వస్తుంటే చిట్టి కొనదగ్గర మర్రిచెట్టు కింద ఒక కొత్త గడ్డం సాములోరు ఎవరో తపస్సు చేస్తున్నారు. మనవాడు గురించి చెప్తే, వాడి దోషానికి పరిష్కారం ఉంది వాడిని పట్టుకుని వెళ్తే ఏం చేయాలో చెప్తాడు” అన్నాడు.

A Great Teacher

దంతో అనసూయమ్మ ప్రవీణ్ను తీసుకుని సన్యాసిరావుతో సాములోరు దగ్గరకు వెళ్లారు. సాములోరు ప్రవీణ్ తలపై చేతులు పెట్టి “నీ దోషానికి ఒక పరిష్కారం ఉంది” అంటూ ఓ కొమ్మ చూపించి, “ఆ కొమ్మ చాలా మహిమగల కొమ్మ. నీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఈ కొమ్మ కిందకి వచ్చి కళ్లు మూసుకుని మనసులో ఏమి కావాలో కోరుకున్న వెంటనే. ఆ కొమ్మ నుంచి ఆకు రాలితే నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది, కాని మన పనిలో ప్రయత్నలోపం ఉండకూడదు” అని సూచించాడు.

అది విన్న ప్రవీణ్ వెంటనే “రేపు జరిగే పరీక్ష నేను చాలా బాగా రాయాలి” అని మనసులో అలా కోరుకున్నాడో లేదో వెంటనే ఒక ఆకు రాలి కింద పడింది. అది గమనించిన ప్రవీణ్ చాలా హుషారుగా గెడ్డం సాములోరికి దండం పెట్టి అమ్మనాన్నలతో ఉత్సాహంగా తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

దీంతో పరీక్ష బాగా రాసాడు. ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్లి మనసులో కోరిక కోరుకుని తిరిగి వచ్చి కష్టపడి చదివేవాడు. అలా పరీక్షకి ప్రవీణ్ భయం మెల్ల మెల్లగా దూరమైంది.

A Great Teacher

చివరి పరీక్ష ముందు రోజు ఎప్పటి లాగే ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు ప్రవీణ్. కళ్లు మూసుకుని ఎప్పటిలాగే మనసులో కోరుకున్నాడు కానీ ఆ రోజు ఎంతకీ ఆకులు రాలకపోయే సరికి, సందేహంతో ఆ కొమ్మవైపు చూసే సరికి సాములోరు చెప్పిన ఆ మహిమ గల కొమ్మకు ఒక్క ఆకు కూడా లేదు.

ఇంకా తాను ఏం కోరుకున్నా ఆకు రాలదు అని భయపడ్డాడు. ఈ విషయం సాములోరికి చెబుదామని ప్రవీణ్ వెళ్తుండగా ప్రవీణ్ తండ్రి గొడ్డలితో ఆ చెట్టు కొమ్మను నరకటం గమనించాడు ప్రవీణ్.

A Great Teacher

“నాన్న! ఆ కొమ్మను ఎందుకు నరుకుతున్నావ్? అది చాలా మహిమ గల కొమ్మ అని సాములోరు చెప్పారు కదా! అది నరికితే నా కోరికలు ఎలా తీరుతాయి?” అన్నాడు ప్రవీణ్ భయంగా.

అప్పుడు సన్యాసిరావు “రేయ్! ఈ చెట్టుకి ఇన్ని కొమ్మలుండగా ఒక్క కొమ్మ నుంచే ఎందుకు ఆకులు రాలేవో ఆలోచించు. ఆ కొమ్మకు మహిమ కాదు తెగులు పట్టింది. దాని మూలాన ఆకులు రాలేవి. నువ్వు దాన్ని గుడ్డిగా నమ్మి నీలో నీకు తెలియకుండా ఆత్మస్థైర్యం పెరిగి కష్టపడి చదివి, పరీక్షలు బాగా రాసావు. అంతేకానీ ఆకులు రాలడం వల్ల కాదు” అని చెప్పాడు.

కొమ్మ నరికడం వల్ల కొత్తకొమ్మలు చిగురిస్తాయని తండ్రి చెప్పాడు. అంతేకాదు నీలోని భయాన్ని పోగొట్టేందుకు మీ ప్రసాదు మాస్టారు గెడ్డం సాములోరు వేషంలో వచ్చి ఈ విధంగా నాటకం ఆడారు అని తండ్రి చెప్పాడు.

ఎప్పుడు భయంతో బెంగగా ఉండే ప్రవీణ్ ఆత్మవిశ్వాసం పెరిగింది. తనను తాను నమ్మటం మొదలు పెట్టాడు ప్రవీణ్. దీంతో బాగా చదివి, ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

తమ కుమారుడిలో మార్పు రావటానికి ఎంతో కష్టపడ్డ ప్రసాదు మాస్టారుకు కృతజ్ఞతలు చెప్పారు ప్రవీణ్ తల్లిదండ్రులు. స్కూల్ అంతా కూడా మంచి మాస్టార్ అని మెచ్చుకున్నారు.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/unity-is-strength-story/kids-stories/526273/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870