బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకల సందర్భంగా బీసీలకు మద్దతుగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మద్దతుగా ఏర్పడిన జాగృతి సంస్థ, రాష్ట్ర స్థాయిలో బీసీల సాధికారత కోసం పునరుద్ధరణ దిశగా ముందడుగేస్తుందని తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి (Jagruthi) ముందుకెళ్లిందని తెలిపారు. ఈ సందర్భంగా కవిత (Kavitha) మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీసీల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం
బీసీ వర్గాల సాధికారతకు జాగృతి సంస్థ మరిన్ని పోరాటాలు చేపట్టబోతుందని కవిత తెలిపారు. బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ మోసం చేశాయి అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ (Congress) చేస్తున్న ధర్నాపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఇవి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం కావు అని అన్నారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకుని అఖిలపక్షాన్ని పంపించాలి
రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు చేయడం కాదు, నిజమైన మార్పుకు ప్రయత్నించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకుని, అన్ని పార్టీలు కలిసిపోయి బీసీల హక్కుల కోసం ఢిల్లీలో ముందుకెళ్లాలి అని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖలు రాయాలని సూచించారు.
జాగృతి కొత్త కమిటీలు ఈ నెల 15లోపు
ఈ నెల 15లోపు జాగృతి సంస్థకు కొత్త కమిటీలు ఏర్పాటవుతాయని, వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు సంస్థలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆమె తెలిపారు. అన్ని వర్గాల మద్దతుతో జాగృతి మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: