టంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అయ్యాక, వలసవాదులపై తన ఉక్కుపాదాన్ని మోపి, కఠిన చర్యలు దిగారు. అక్రమంగా ఉంటున్న వలసదారులను (immigrants) ప్రత్యేక విమానాల్లో ఆయాదేశాలకు తరలించిన సంగతి తెలిసిందే. ఇక అధిక సుంకాలను విధిస్తూ, అనేకదేశాలకు పక్కలో బల్లెంగా మారారు. తాను చెప్పిందే వేదం, తన మాటే ఖచ్చితం అనేలా ప్రవరిస్తున్నారు. ఇతర దేశాలతో కయ్యానికికాలు దువ్వుతూ పలు విమర్శలకు గురవుతున్నారు.
ట్రంప్ కు బ్రెజిల్ అధ్యక్షుడి స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ పై సుంకాలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. సమస్యల పరిష్కారం కోసంఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయొచ్చంటూ ఆ దేశ అధ్యక్షుడికి ఆఫర్ కూడా ఇచ్చారు. దీనిపై బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్లా (Lula da Silla) ట్రంప్ కు గట్టి జవాబుచ్చారు. ట్రంప్ తనతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని, అందుకే నేను ఆయనకు ఫోన్ చేయనని లులా స్పష్టం చేసారు.ఆయన స్థానంలో తాను బ్రిక్స్ భాగస్వాములైన భారతదేశ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లకు ఫోన్ చేసి,వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటానని తేల్చి చెప్పారు.

ఆఫర్ ను ఆతిరస్కరించిన లులా
50శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికతో ఈ వివాదం మొదలైంది. ట్రంప్ ఈ సమస్యపై లులాతో మాట్లాడటానికి ఆసక్తి చూపినప్పటికీ లులా మాత్రం ఆయన ఆఫర్ను తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ట్రంప్ కు ఫోన్ చేయనని అన్నారు. ఎందుకంటే ఆయన తనతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని వివరించారు. అందువల్లే తాను చైనా అధ్యక్షుడుజిన్పింగ్ కు, భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి విదేశీ వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. రష్యాఅధ్యక్షుడు పుతిన్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణించలేరు కాబట్టి ఆయనకు ఫోన్ చేయలేనని లులా పేర్కొన్నారు.
బ్రెజిల్ ఎక్కడ ఉంది?
బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఇది ఆ ఖండంలోనే అతిపెద్ద దేశం.
బ్రెజిల్‌లో ప్రధానంగా మాట్లాడే భాష ఏది?
బ్రెజిల్ అధికారిక భాష పోర్చుగీస్ (Portuguese).
Read hindi news: hindi.vaartha.com
Read Also: