हिन्दी | Epaper
హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Third Wave Risk from Medical Mafia:మాఫియాను కట్టడి చేయకపోతే మూడోవేవ్ ముప్పే

Hema
Third Wave Risk from Medical Mafia:మాఫియాను కట్టడి చేయకపోతే మూడోవేవ్ ముప్పే

Third Wave Risk from Medical Mafia:ఒకటి కాదు రెండుసార్లు కరోనా తన ప్రభావం చూపించింది. రెండు పర్యాయాలు విభిన్న రీతిలో, అనూహ్యంగా ప్రజలపై విరుచుకుపడింది. మొదటి వేప్లో ఉన్న పంథా వేరు. రెండవ వేప్లో ఉధృతి
వేరేగా ఉంది. అయితే ప్రైవేటు (private) ఆసుపత్రుల దోపిడీ మాత్రం రెండుసార్లు కూడా ఒకే విధంగా ఉంది. మొదటి దశలో కరోనాపై సరైన అవగాహన లేదు.

మందు కూడా లేదు. ఇప్పటికీ మందు లేకపోయినప్పటికీ వాక్సిన్ ప్రవేశం కొంత ఊరటనిచ్చింది. అయితే ఇవన్నీ ప్రైవేటు మెడికల్ మాఫియా ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రాణాలు పోతాయన్న భయంతో ఉన్న రోగులను మరింతగా పీడించి పిప్పి చేశాయి. మొదటిసారి మెడికల్ మాఫియా రెచ్చిపోతుంటే ప్రభుత్వం సరైన
చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా మొదటిసారి రావడం, పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులకు ప్రభుత్వం సేవలు అందించే స్థాయిలో లేకపోవడంతో మెడికల్ మాఫియాను (Mafia) కట్టడి చేయలేకపోయింది. నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. రెండుసార్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు ఈ అంశంపై సీరియస్ గానే స్పందించాయి.

Third Wave Risk from Medical Mafia

అయినా ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లలేదు. పైగా ఆసు పత్రుల లైసెన్స్లు రద్దు చేస్తే రోగులకు సేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతాయని ప్రభుత్వాలు సన్నాయి నొక్కులు నొక్కాయి. ప్రజల భయాందోళను గుర్తించి అన్యాయంగా అక్రమంగా లక్షల రూపాయలు బిల్లులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ఆసుపత్రుల లైసెన్స్లు రద్దు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. న్యాయస్థానాల ఒత్తిడితో కొన్ని ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స నుంచి మాత్రమే మినహాయించి మెడికల్ మాఫియాను కట్టడి చేసినట్లు చిత్రీ కరించుకున్నాయి. అయితే కొన్ని రోజులకే ఈ నిషేధం ఎత్తివేసి కొవిడ్ పరీక్షలకు అనుమతించారు.

ప్రభుత్వాలు తమను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాయని గుర్తించిన కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కరోనాతో మృతి చెందిన రోగుల మృతదేహాలు ఇవ్వడానికి కూడా లక్షలాది రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. కరోనా నిర్థారణ నుంచి ఆక్సిజన్, వెంటిలేటర్, ఐసియు వంటి ప్రత్యేక చికిత్సల వరకు అన్ని రకాలుగా దోపిడీ కొనసాగాయి.

రోజుకు లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసిన ఆసుపత్రులు కూడా ఉన్నాయి. వివాహం కోసం అమెరికా నుంచి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి హైదరాబాద్లో కరోనా బారిన పడింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఆమె చికిత్సకు సదరు ఆసుపత్రి ఇచ్చిన బిల్లు 50 లక్షల రూపాయలు. చికిత్స చేయడంలో అలక్ష్యం చేసిన మెడికల్ మాఫియా ఫీజుల వసూలు విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించారు. రాష్ట్రంలో మంత్రులు జోక్యం చేసుకున్నా తమ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేసిన ఆసుపత్రులు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి.

కరోనా రెండు వేవ్ ద్వారా ఒక విషయం తేటతెల్లమైంది.

ప్రైవేటు ఆసుపత్రులను కట్టడి చేసే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేవన్నవిషయం స్పష్టంగా తేలింది. తెలంగాణ హైకోర్టు ఒక అడుగు ముందుకు వేసి అక్రమంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి ఆయా బాధిత కుటుంబాలకు ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయితే ఎక్కడాడబ్బు వాపసు ఇచ్చిన దాఖలాలు లేవు. కరోనా చికిత్స విషయంలో ఒక విధానం లేకుండా పోయింది. ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ కింద అనుమతి ఇస్తే తెలంగాణాలో అమలుకాలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో
మెడికల్ మాఫియా మాత్రం దోపిడీని యధేచ్ఛగా కొనసాగించింది. చివరకు రెమిడిసివర్, ఇతర ఇంజక్షన్లను స్వయంగా ఆసుపత్రుల నిర్వాహకులే బ్లాక్ మార్కెట్కు తరలించారు. 30 నుంచి 40 వేలు అదనంగా వసూలు చేసి ఇంజక్షన్లను సమకూర్చిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఈ ఖరీదైన ఇంజక్షన్లు వేసినట్లు నటించి కేవలం సెలైన్ వాటర్ను అందించారని ఫిర్యాదులు కూడా నమోదు అయ్యాయి. రెండుసార్లు కరోనా ప్రభావం కనిపిం
చినా ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి అడ్డుకట్ట వేయలేకపోయాయి.

Third Wave Risk from Medical Mafia

ఇప్పటికైనా మూడవ వేవ్ వచ్చే సమయానికి వైద్య చికిత్సలో స్పష్టమైన విధానాన్ని రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలోని సీనియర్ వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు ఆసుపత్రులు, వాటి నిర్వాహకుల సంఘాల ప్రతినిధులతో ఒక కమిటీ రూపొందించాలి. ప్రైవేటు ఆసుపత్రులను గ్రేడులుగా విభజించి కరోనా వైద్య చికిత్స వ్యయాన్ని స్పష్టంగా రోగులకు. వారి బంధువులకు తెలియజేయాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరాలనే రోగులకు ఆన్లైన్ ద్వారా వారు కోరుకున్న ఆసుపత్రిలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలి.

రోగులు కట్టే ప్రతి బిల్లు పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టే విధానాన్ని అమలుచేయాలి. వైద్య విద్యకోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. విద్య పూర్తి చేసుకున్న డాక్టర్లు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పూర్తిగా

వ్యాపార ధోరణితో ప్రైవేటు రంగం వైపు దృష్టి సారిస్తున్నారు

. వైద్య నిపుణులు కరోనాలాంటి విపత్కర పరిస్థితిల్లో కొన్ని రోజులు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే విధంగా చట్టాన్ని సవరించాలి. రోగుల నుంచి వచ్చే ఫిర్యాదు లపై పరిశీలన జరిపేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
ఫిర్యాదు చేసిన వారికి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దర్యాప్తు వివరాలు తెలిసే సౌకర్యాన్ని కల్పించాలి. ఏదైనా ఆసుపత్రిపై నిర్దేశించిన దాని కంటే ఎక్కువ ఫిర్యాదులు వస్తే భారీగా జరిమానాలు విధించడం, కొంతకాలం పాటు లైసెన్స్ రద్దు చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఫిర్యాదు చేసేవారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పద్ధతి కాకుండా ఆన్లైన్ ద్వారాగాని, సమీపంలోని మెడికల్అధికారికి కాని ఫిర్యాదు చేసి రశీదు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి. ఇప్పటినుంచే ప్రైవేటు ఆసుపత్రులను కట్టడి చేయడానికి చర్యలు ప్రారంభించకపోతే మూడో వేవ్ కరోనాకంటే ఆసుపత్రుల వల్ల ఇబ్బంది పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/alert-on-medical-mafia/sanghibavam/526226/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870