తిరుపతి : రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతిలో (Tirupati) సెప్టెంబర్ 12 నుండి 14వ తేదీవరకు మూడు రోజుల పాటు శ్రీకృష్ణదేవ రాయ స్వర్ణోత్సవ నృత్యకళోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రంగస్థలి ఛైర్మన్ గుండాల గోపీనాధరెడ్డి తెలిపారు. శాస్త్రీయ నృత్య జానపద పోటీలు ఉంటాయన్నారు. బృదంనృత్యాలలో తమ ప్రతిభచూపిన కళాకారులకు మొదటి బహుమతిగా 10వేల రూపాయలు, రెండో బహుమతిగా 6వేలు రూపాయలు, తృతీయ బహుమతిగా 3వేల రూపాయలు, సోలో నృత్యోత్సవాల్లో విజేతలకు మొదటి బహుమతి 4 వేలు, రెండోబహుమతి 3వేలు. మూడో బహుమతి 2వేల రూపాయలు, జాపికలు అందజేస్తామన్నారు. ప్రదర్శనల్లో పాల్గోన్న కళాకారులకు మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. తిరుపతి, చిత్తూరు, కడపజిల్లాల కళారారులు 12వతేదీ పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. మరిన్ని వివరాలకు రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజ, 9347046608 నంబరు సంప్రదించాలని, ఆగస్ట్ 20 వతేదీ లోపు దరఖాస్తులు పంపాలని కోరారు.

READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :