త్వరలోనే అధికారిక ఉత్తర్వులు
హైదరాబాద్ : తెలంగాణలోని మెప్మా ఉద్యోగులకు (Mepma employees) శుభవార్త. త్వరలోనే అలెవెన్సులతో కూడిన పూర్తి జీతం అందనుంది. రూ. 10 వేల అలవెన్సు అదనంగా ఇవ్వనున్నారు. గత యేడాది ఆగస్టులో సెర్ప్ సిబ్బందితో సమానంగా పూర్తి పేస్కేల్ పొందుతున్న 378 మంది ఉద్యోగులకు.. మే నెల నుంచి తగ్గిపోయిన జీతాలు త్వరలో మళ్లీ పూర్తి స్థాయిలో రానున్నాయి. అలవెన్సుల విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా.. వారికి తిరిగి రూ. 32 వేల వరకు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పురపాలక సంస్థల్లో పేదరిక నిర్మూలన పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అందనుంది. వారికి అన్నిరకాల అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వ డానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
మెప్మా ఉద్యోగులకు త్వరలోనే రూ.10 వేలు అలవెన్స్ తిరిగి
ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా రూ.10 వేలు ఇచ్చేందుకు సర్కార్ రెడీగా (government is ready) ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయని ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది. కాగా, మెప్మా (Mepma employees) లో పనిచేస్తున్న 378 మంది ఉద్యోగులకు గత యేడాది ఆగస్టులో సెర్చ్ సిబ్బంది. మాదిరిగానే పూర్తి పేస్కేల్ (Payscale) అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెలా సుమారు రూ.32,000 వేతనం పొందేవారు. అయితే మే నెల నుంచి వారి వేతనంలో దాదాపు రూ.10 వేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అలవెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ, అలవెన్స్లతో కూడిన పూర్తి వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వివరించారు.
మెప్మా ఉద్యోగులకు ఎంత అదనపు అలవెన్సు ఇవ్వనున్నారు?
మెప్మా ఉద్యోగులకు రూ.10 వేల అదనపు అలవెన్సు ఇవ్వనున్నారు.
ప్రభుత్వం ఏ ఆధారంగా పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది?
ప్రభుత్వం కమిటీ నివేదిక ఆధారంగా పూర్తి వేతనం ఇవ్వాలని నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: