బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరంగా యాత్ర ప్రముఖ డా. జి.మనోహర్ రెడ్డి
హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా, తిరంగా యాత్ర, దేశభక్తి కార్యక్రమాల నేపథ్యంలో మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాల యంలో రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పార్టీ తరఫున ముఖ్యఅతిథిగా మాజీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి వి.డి. శర్మ పాల్గొని దిశానిర్దేశం చేశారు. విభజన గాయాల స్మృతిదినం, పార్ ఘర్ తిరంగా, తిరంగా యాత్రలపై కార్యాచరణపై చర్చించారు. తిరంగాయాత్ర ప్రముఖ డాక్టర్ జి. మనో పార్రెడ్డి, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి, అధికార ప్రతినిధి రాణీరుద్రమ తదితరులు పాల్గొని పలుజంశాలపై చర్చించారు.
ప్రతి పౌరుడికీ గర్వకారణం అని అన్నారు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు దేశప్రజలతో కలిసి తిరంగా యాత్రలు, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశసమైక్యత, సమగ్రత కోసం ప్రతిఖు చేయా లని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢనాయకత్వం, సాయుధ దళాల ధైర్యసాహసం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షల ఫలితంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతంగా నిర్వహించడం ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనం, ప్రతి పౌరుడికీ గర్వకారణం అని అన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీ పేర్కొన్నట్లుగా ఇది భారత విజయోత్సవానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన సెషన్, ఉగ్రవాదుల కేంద్రాన్ని నేలమట్టం చేసినందుకు.. సిందూర్ శపథం నెరవేరినందుకు జరిగే వేడుకలన్నారు. ఆగస్టు 6-8న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్య శాలల్లో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా మోర్చా, యువ మోర్చా ప్రతినిధులు పాల్గొం చారు. ఆగస్టు 7 8న మండల స్థాయి కార్యశాలల్లో భాగంగా శక్తికేంద్ర ఇన్చార్జ్, బూత్ అధ్యక్షులు పాల్గొంటారు.

స్మారక చిహ్నాల
ఆగస్టు 9-12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామం నుంచి నగర స్థాయిలో బిజెపి ఆధ్వర్యంలో, ఘనంగా తిరంగా యాత్రలు దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యం తోడుగా తీర్థయాత్రలా త్రివర్ణ పతాకాలతో ఊరేగింపులు. జరగనున్నాయి. 12 – 14 తేదిల్లో స్వాతంత్ర్య పోరాట స్మారక చిహ్నాల వద్ద, స్వాతంత్ర్యోద్యమంలో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, యుద్ధ స్మారక చిహ్నాల చుట్టూ స్వచ్ఛతా కార్యక్రమాలు జరగనున్నాయి. అమర జవాన్ల (immortal soldiers) చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించడంతో పాటు మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాలను సన్మానించడం, మాజీ సైనికుల ఇళ్లను సందర్శించి సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. 13-15 తేదీల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
సమన్వయం చేస్తాను
ఆగస్టు 14, 2025 వ తేదీన విభజన గాయాల స్మృతిదినం సందర్భంగా అన్ని జిల్లాల్లో బ్యానర్లు, ప్లకార్డులతో మోన ప్రదర్శనలు, హాల్ మీటింగ్లు, ఎగ్జిబిషన్లు, విభజనతో ప్రభావితులైన వారిని సన్మానించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్బ జాతీయ ఉపాధ్యక్షురాలు లతా ఉపేండి, జాతీలు కార్యదర్శులు డా. నరేందర్ రైనా, రితురాజ్ సి కామాఖ్య ప్రసాద్ తాసా. మాజీ రాష్ట్ర అధ్యక్షు కె. సురేంద్రన్, వి.డి. శర్మ, సదానంద్ షెట్ తానావా జాతీయ స్థాయిలో కార్యక్రమాలను సమన్వయం చేస్తాను బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. గంగిడి మనోహర్ కన్వీనర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మె మల్క కొమరయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి రా రుద్రమ, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేంది సభ్యులుగా నియమితులైన రాష్ట్ర కమిటీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను సమన్వయం చేస్తారు.
హర్ ఘర్ తిరంగ ప్రచారం అంటే ఏమిటి?
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రారంభించబడిన ఈ ప్రచారం, ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పౌరులు స్వచ్ఛందంగా పాల్గొనడానికి పాల్గొనడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది .
హర్ ఘర్ తిరంగ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
Read hindi news: hindi.vaartha.com
Read Also: