హైదరాబాద్ (CBI) : వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపి (Kadapa MP) అవినాష్ రెడ్డి సహా ఇతరనిందితుల బెయిల్ ను రద్దు చేసేందుకు సంబంధించి వివేకా తనయ సునీతతో పాటు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. దివంగత సీఎం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సిబిఐ విచారణ ముగిసింది. గత నెల 21వ తేదీన సుప్రీం కోర్టు సిబిఐని మూడు అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించడం తెలిసిందే. దీని తరువాతే కడప ఎంపి అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులా బెయిల్ రద్దు పిటిషన్లపై వి చారణ చేబడతామని పేర్కొనడం విదితమే. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. మేరకు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ వివరాలను మంగళవారం నాడు సిబిఐ సుప్రీం కోర్టుకు తెలి పింది. వివేకా హత్య కేసులో ఇంకా తదు. పరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందో? లేదో? సుప్రీం ధర్మాసనం కోరింది. దీంతో పాటు ఎపి ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వై.ఎస్ వివేకా తనయ సునీత, ఆమె భర్త నర్రెడ్డిపై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపైనా అభిప్రాయం చెప్పాలని సిబిఐని సుప్రీం కోర్టు (Supreme court) కోరింది. ఇదే సమయంలో వివేకా హత్య కేసు ట్రయ ల్, తదుపరి విచారణ ఏకకాలంలో కొనసాగించే అవకాశం వుందా? అన్న విషయంపైనా సిబిఐ అభిప్రాయం చెప్పాలని సుప్రీం కోర్టు కోరింది.

వివేకా హత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ ముగిసిందని సిబిఐ తరపు న్యాయవాది తెలిపారు. జస్టిస్ ఎంఎం సుందరేషన్ నేతృత్వంలోని ధర్మా సనానికి ఈ మేరకు సిబిఐ స్టేటస్ వివరాలను అందజేసింది. మరోవైపు ఇదే కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డితో పాటు మరికొందరు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా దీనిని సిబిఐతో పాటు వివేకా తనయ సునీత సుప్రీం కోర్టులో సవాల్ చేయగా దానిపైనా మంగళవారం నాడు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. బెయిల్పై వున్న వారు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు న్యాయవాది సిద్దార్థలూద్రా సుప్రీం కోర్టుకు తెలిపారు. వివేకా హత్య కేసు దర్యాప్తు అధికారి రాంసింగ్తో పాటు సునీత దంపతులపై నమోదైన కేసులో ఎపి సర్కారు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రాంసింగ్తో పాటు సునీత దంపతులపై అప్పట్లో కేసు నమోదయ్యిందని క్లోజర్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని లూద్రా తెలిపారు. ఈ కేసులో అవినాష్ రెడ్డితో పాటు ఇతర నింధితుల బెయిల్ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లూద్రా కోరగా దీనిపై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :