Aloo Puri Recipe:కావలసిన పదార్థాలు
- ఆలుగడ్డలు: 4 (మెత్తగా ఉడికించి సిద్ధంగా పెట్టుకోవాలి)
- గోధుమ పిండి: 3 కప్పులు
- మైదా పిండి: ఒక టేబుల్ స్పూన్
- గోరువెచ్చని నీళ్లు: పూరీపిండి కలిపేందుకు
- కొత్తిమీర తురుము: కొద్దిగా
- కారం: ఒక టీ స్పూన్
- పసుపు: చిటికెడు
- ఉప్పు: తగినంత
- నూనె: సరిపడినంత

Aloo Puri Recipe:తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని, అందులో ఆలుగడ్డల (Potatoes) ముద్ద, గోధుమ పిండి, మైదా పిండి, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్ నూనె (oil) వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. కలిపిన పిండిని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుని, నూనె వేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి కాగిన తరువాత పూరీని ఇరువైపులా పొంగేలా వేయించాలి.

Read also:hindi.vaartha.com
Read also: