మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారుతున్నాయా? చేతులు గుంజడం, మొద్దుబారడం, స్పర్శ కోల్పోవడం వంటి అనుభూతులు తరచూ ఎదురవుతున్నాయా? ఈ లక్షణాలు కేవలం అలసట వల్ల కాదు. ఇవి మీ శరీరంలో ఒక ముఖ్యమైన పోషక లోపానికి సంకేతంగా ఉండొచ్చు.
తిమ్మిర్లకు కారణం ఏమిటి?
ఒకవేళ మీరు ఏకపక్షంగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తిమ్మిరి అనిపించిందంటే అది సహజం. కానీ అలాంటి అనుభూతులు పదే పదే కలుగుతున్నాయంటే మాత్రం మీ శరీరంలో విటమిన్ బి12 లోపం ఉన్న అవకాశం ఉంది. వైద్య నిపుణుల ప్రకారం, దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నరాల ఆరోగ్యం దెబ్బతింటుంది.

విటమిన్ బి12 ఎందుకు ముఖ్యమో తెలుసా?
విటమిన్ బి12 మన శరీరానికి చాలా అవసరం. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, మెదడు, నరాల పనితీరుకు, శక్తి సరఫరాకు, అధికంగా మాంసాహారంలో లభించే బి12, పూర్తి శాఖాహారులైనవారిలో అధికంగా లోపిస్తుంటుంది.
బి12 లోపం ఉన్నప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు
- చేతులు – కాళ్ళు తిమ్మిరిగా మారడం లేదా జలదరింపు
- బలహీనత, అలసట (Weakness, fatigue)
- తలతిరుగుడు
- జ్ఞాపకశక్తి లోపం
- మానసిక ఆందోళనలు, డిప్రెషన్
- నాలుక వాపు, నోటిలో పుండ్లు.
పరిష్కారం ఏమిటి?
బి12 లోపాన్ని తగ్గించడానికి
- మీ డైట్లో గుడ్లు, పాలు (Eggs and milk in diet), పెరుగు, జున్ను, చేపలు, చికెన్ వంటివి చేర్చండి.
- మీరు శాకాహారులు అయితే, డాక్టర్ సలహా మేరకు బి12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
- తీవ్రమైన సందర్భాల్లో బి12 ఇంజెక్షన్లు లేదా మాత్రలు తీసుకోవాలని వైద్యులు సూచించవచ్చు.

తనిఖీ చేయడం ఎలా?
మీకు తరచూ తిమ్మిరి, అలసట, తలతిరుగు వంటి సమస్యలు ఉంటే, రక్త పరీక్ష ద్వారా విటమిన్ బి12 స్థాయిలను తనిఖీ చేయడం ఉత్తమం. సమయానికి గుర్తించి చర్యలు తీసుకుంటే సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు.
చిన్న సంకేతం – పెద్ద హెచ్చరిక
చేతులు కాళ్లు తిమ్మిరిగా మారడం సాధారణమని భావించడం ప్రమాదకరం. ఇది నాడీ వ్యవస్థకు సంకేతంగా ఉండవచ్చు. విటమిన్ బి12 లోపాన్ని అణచివేయకపోతే, అది శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీయగలదు. కాబట్టి, మీ శరీరం ఇస్తున్న సంకేతాలను గుర్తించి, నిపుణుల సలహా తీసుకోండి.
Read hindi news: hindi.vaartha.com
Read also: