బీఆర్‌ఎస్ సీనియర్ నేత, హరీష్ రావు గోదావరి ప్రాజెక్టుల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) ను బ్రిటిష్ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ (Sir Arthur Cotton) తో పోల్చారు. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ ప్రస్తావన చేస్తూ, తెలంగాణలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతే చరిత్రాత్మకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాటన్ గోదావరి జిల్లాలకు నీటి ప్రాణం – కేసీఆర్ తెలంగాణకు
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ – బ్రిటీష్ పాలనలో ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీటి భద్రత కలిగించారని గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం కాటన్ చేసిన కృషికి బ్రిటీష్ ప్రభుత్వం కూడా విమర్శలతో స్పందించిందని.. హెమింగ్టన్ కమిషన్ ద్వారా కాటన్‌ను 900 ప్రశ్నలు అడిగి, వేధించిందని వివరించారు.
కాళేశ్వరం – తెలంగాణకు జీవనాధారం
అలాగే, కేసీఆర్ (KCR) కూడా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా తెలంగాణ భవిష్యత్తుకు బలమైన మౌలిక వనరులు అందించారని హరీష్ పేర్కొన్నారు. ఇది కూడా సిరిసిల్ల నుంచి మహబూబ్నగర్ వరకు సాగు నీటిని, తాగునీటిని అందించే దిశగా కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని చెప్పారు.
‘కాళేశ్వరం గురించి రేవంత్‌కు కూడా తెలుసు’’
కాళేళ్వరం తెలంగాణకు గుండెకాయ వంటిదని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతపై అవగాహన ఉందని హరీష్ అన్నారు. మల్లన్నసాగర్ నుంచి మూసీ నదిలోకి నీళ్లు తరలించే ప్రాజెక్టుకు రూ.6 వేల కోట్ల టెండర్లు ఫైనల్ కావడాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగమేనని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: