Pak: పాకిస్తాన్ లో గతకొన్ని రోజులుగా ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ నష్టాన్ని చవిచూస్తున్నది. దాదాపు నెలరోజులకు పైగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 300 మంది మరణించినట్లు ఇక్కడి అధికారుల వెల్లడించారు. వీరిలో 140 మంది చిన్నారు ఉన్నారు. దేశంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. వరదలకు వందలాది ఇండ్లు కూలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. మహిళలు, పిల్లలకు ఆహారం, నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. దైనందిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతున్నది. కూరగాయలు, సరుకులు కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను (Serious trouble) ఎదుర్కొంటున్నారు.

విపత్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..
జూన్ 26వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా సుమారు 299 మంది మృతి చెందారు. ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు దేశవ్యాప్తంగా 715 మంది గాయపడ్డారు. దాదాపు 562 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. వర్షాల ధాటికి మూగజీవాలు కూడా మృతి చెందాయి. కాగా మరో నాలుగు రోజులు కూడా పాకిస్తాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ (Weather Alert) చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లతో నిండిపోయాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
పాకిస్తాన్‌లో ఇటీవల వర్షాల వల్ల ఎంత నష్టం జరిగింది?
జూన్ 26 నుంచి కురుస్తున్న వర్షాలతో 299 మంది మృతి చెందగా, 562 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వర్షాల ప్రభావం ప్రజలపై ఎలా ఉంది?
వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయి, ప్రజలు ఆహారం, నీళ్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: