30 మందిపైగా విద్యార్థినులకు అస్వస్థత
కల్లూరు (ఖమ్మం) : ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పి ఆవరణలో ఉన్న గిరిజన ఆశ్రమం బాలికల పాఠశాలలో (Kallur Ashram School) విద్యార్థినులు ఉదయం అల్పాహార కిచిడి తిన్న అనంతరం కడుపు నొప్పి వాంతులు విరోచనాలకి గురై తీవ్ర ఆందోళన గురయ్యారు. హాస్టల్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినటం వల్ల విద్యార్థినులు 30 మందికిపైగా తీవ్రఅస్వస్థతకు గురై హాస్పి టల్ పాలయ్యారు. ఈ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహంలో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు 91 మంది విద్యార్థినులు చేరి విద్య అభ్యసిస్తున్నారు. సోమవారం ఉదయం అల్పాహారం పేరుతో కిచిడి హాస్టల్ వార్డెన్ పిల్లలకు పెట్టడంతో తిన్న కొద్దిసేపటికి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు రావడంతో గమనించిన హాస్టల్ సిబ్బంది కల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేపట్టారు.

కల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం
Kallur Ashram School: హాస్టల్లో ఉన్న 91 మందిలో దాదాపు ఈ కిచిడి 50 మందికి పైగా తినడంతో 30 మందికి పైగా తీవ్రఅస్వస్థతకు గురై హాస్పటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. కల్లూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అల్పాహారం తిని ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థత గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానందం (MLA Dr. Matta Ragamayi Dayanandam) హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విద్యార్థులను పరిశీలించి ఆమె కూడా డాక్టర్ అవతారం ఎత్తి తోటి వైద్యులతో విద్యార్థులను పరీక్షి ంచి చికిత్సను చేయడం జరిగింది. అనంతరం గిరిజన హాస్టల్ పరిశీలించి ఆహార పదార్థాలను, ఈరోజు జరిగిన విషయాన్ని తోటి విద్యార్థినిలను అడిగి తెలుసుకుని, ప్రతిరోజు విద్యార్థులకు పెట్టాల్సిన మెనూ కూడా సక్రమంగా పెట్టట్లేదని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద వార్డెన్పై తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.
హాస్టల్లో నిర్లక్ష్యంగా నిర్వహణ – వార్డెన్‌పై చర్యలకు ఎమ్మెల్యే ఫిర్యాదు
హాస్టల్లో సక్రమంగా మెనూ అమలు చేయనందుకు, విద్యార్థుల పట్ల నిరక్ష ్యంగా వ్యవహరిస్తూ, సోమవారం విద్యార్థుల్లో ఫుడ్ పాయిజన్ (Food poisoning) పట్ల నిరక్ష ్యం వహించి వార్డెన్పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. విద్యార్థినులను అందుబాటులో ఉన్న ఎఎంసి చైర్మన్, లోకల్ నాయకుల వాహనాల్లో, ఆటోల్లో, కమ్యూనిటీ హెల్త్సేంటర్కు తరలించడంతో పిహెచ్సి డాక్టర్ నవ్యకాంత్ కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ డాక్టర్ రమేష్లు ఎండిఒ ఎమ్మార్వోల పర్యవేక్షణలో విద్యార్థినులకు చికిత్సను అందించారు. సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ అజయ్యాదవ్ హాస్పిటల్ కు వచ్చి విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యం అందిం చాలని సూచించారు. అల్పాహారం చేసి తోటి విద్యార్థినులు అస్వస్థతకు గురవటంతో మధ్యాహ్న భోజనానికి చేయటానికి భయపడుతున్న విద్యార్థినులకు ధైర్యం కల్పించడం కోసం ఎండిఒ చంద్ర శేఖర్, ఎమ్మార్వో పులి సాంబ శివుడు, డాక్టర్ నవ్య కాంత్, ఎంపిఒ రంజిత్ కుమార్ భోజనం చేసి విద్యార్థినిలతో కూడా బోజనం చేయించారు.
కల్లూరు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు?
అల్పాహారంగా ఇచ్చిన కిచిడీలో పురుగు ఉండటంతో 30 మందికిపైగా విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు.
అధికారులు తీసుకున్న చర్యలు ఏమిటి?
ఎమ్మెల్యే మట్టా రాగమయి పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, విద్యార్థినులకు వైద్యసహాయం అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: