జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు శిబూ సోరెన్ (Shibu Soren) మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశ ప్రాంతీయ రాజకీయాలకు, ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలకు, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి తీరని లోటు అని కేసీఆర్ పేర్కొన్నారు.

ఝార్ఖండ్ ఉద్యమం – తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి
కేసీఆర్ (KCR) ఈ సందర్భంగా శిబూ సోరెన్ చేపట్టిన ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం(For formation of Telangana state) తాము చేసిన ఉద్యమానికి శిబూ సోరెన్ పోరాటం ఒక స్ఫూర్తిదాయకమైన ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
2001లో తొలిసభకు అతిథిగా శిబూ సోరెన్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపన అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా శిబూ సోరెన్‌ను ఆహ్వానించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన ప్రత్యక్షంగా ఉద్యమ పట్ల చూపిన మద్దతు గుర్తించదగినదని చెప్పారు.
యూపీఏ ప్రభుత్వంలో జేఎంఎం పాత్ర
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో, జేఎంఎం భాగస్వామిగా ఉండటం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా నిలిచిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో శిబూ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం పాత్ర అపురూపమని అన్నారు.
ఆశీస్సుల కోసం వ్యక్తిగతంగా కలవడం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక 2022లో శిబూ సోరెన్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నానని కేసీఆర్ తెలిపారు. ఆయన వ్యక్తిత్వం, రాజకీయ విలువలు ఎంతో ప్రభావితం చేశాయని కొనియాడారు. వారి కుమారుడు, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: