हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

USA : ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా

Sudha
USA : ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా

రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా (USA) కొత్తగా ఒత్తిడి పెంచుతోంది. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే దాన్ని ఉక్రెయిన్‌ యుద్ధంలో నిధులుగా పరిగణిస్తున్నారు. ఈ విషయాన్ని పునరావృతం చేస్తూ, అమెరికా భారతదేశం (India)పై మరింత ఒత్తిడి చూపిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు అనుమతిస్తూ భారత్‌ సాపేక్షంగా ఉక్రెయిన్‌ యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని, ఇది పశ్చిమ దేశాల హితాలకు విరుద్ధంగా ఉందని అమెరికా (USA) పేర్కొంది.ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను ఆపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్‌ మిల్లర్‌ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి క్రూడాయిల్‌ కొనడాన్ని ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నారని వెల్లడించారు. ‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడాని భారత్‌ కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇరుదేశాల చమురు వాణిజ్యం తమకు ఆశ్చర్యం కలిగించింది.

USA :   ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా
USA : ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా

కాగా, అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్లు, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ దాదాపు నిలిపివేసిందని రాయిటర్స్‌ వార్తాసంస్థ కథనం పేర్కొంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియం వంటి భారతీయ చమురు కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని తెలిపింది. రాయితీలు తగ్గడం, సరకు రవాణాలో ఇబ్బందులు తలెత్తడమే ఇందుకు కారణమని వార్తాసంస్థ పేర్కొంది. రష్యా నుంచి ముడి చమురును 2022 నుంచి కొనుగోలు చేస్తున్నా మొట్టమొదటిసారి అతి తక్కువ రాయితీ ఇప్పుడే లభిస్తున్నదని, దీంతో రష్యా నుంచి కొనుగోళ్లను భారతీయ చమురు సంస్థలే నిలిపివేశాయని వార్తాసంస్థ పేర్కొంది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. రష్యా నుంచి ఇక ఎక్కువ కాలం చమురును భారత్‌ కొనుగోలు చేయదని వార్తలు వస్తున్నాయని, అయితే ఈ వార్తలలోని నిజానిజాలు తనకు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే మంచి విషయమేనని అన్నారు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ స్పందిస్తూ.. భారత చమురు అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఆధారంగా, అప్పటి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేశారా లేదా అన్నది సూటిగా సమాధానం చెప్పలేదు.

USA :   ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా
USA : ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్: అమెరికా

పెరిగిన భారం

అమెరికా (USA)ఒత్తిడికి తలొగ్గి రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాల దిగుమతులను భారత్‌ పూర్తిగా నిలిపివేసిన పక్షంలో భారత్‌ చమురు దిగుమతి ఖర్చులు ఏటా 1100 కోట్ల డాలర్లకు (దాదాపు 95 వేల కోట్లు) పెరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద చమురు దిగుమతిదారైన భారత్‌ భారీ రాయితీతో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుని గణనీయ స్థాయిలో ప్రయోజనం పొందింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన దరిమిలా భారత్‌ రష్యా నుంచి తన కొనుగోళ్లను పెంచింది. ఈ యుద్ధానికి ముందు తన మొత్తం చమురు దిగుమతిలో భారత్‌ కేవలం 0.2 శాతం మాత్రమే రష్యా నుంచి కొనుగోలు చేసేది. 2022 తర్వాత ఇది 35 నుంచి 40 శాతానికి పెరిగింది.

అమెరికా చరిత్ర ఏమిటి?

సెప్టెంబర్ 3, 1783న, పారిస్ ఒప్పందంలో, బ్రిటిష్ వారు పదమూడు కాలనీల స్వాతంత్ర్యం మరియు సార్వభౌమత్వాన్ని అంగీకరించారు, ఇది యునైటెడ్ స్టేట్స్ స్థాపనకు దారితీసింది . 1788-89 అధ్యక్ష ఎన్నికల్లో, వాషింగ్టన్ దేశం యొక్క మొదటి US అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అమెరికాలో 52 దేశాలు ఉన్నాయా?

అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 రాష్ట్రాలు , ఒక సమాఖ్య జిల్లా (వాషింగ్టన్, DC, యునైటెడ్ స్టేట్స్ రాజధాని నగరం), ఐదు ప్రధాన భూభాగాలు మరియు వివిధ చిన్న ద్వీపాలను కలిగి ఉన్న ఒక సమాఖ్య గణతంత్ర రాజ్యం. రాష్ట్రాలు మరియు మొత్తం యునైటెడ్ స్టేట్స్ రెండూ సార్వభౌమ అధికార పరిధిని కలిగి ఉంటాయి.

అమెరికాలో కొత్త రాష్ట్రం ఏది?

యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత పురాతన రాష్ట్రం డెలావేర్, ఇది 1787లో స్థాపించబడింది మరియు అతి చిన్నది 1959లో స్థాపించబడిన హవాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also: Pakistan: ఇరాన్ న్యూక్లియర్ కు పాకిస్తాన్ మద్దతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870