దేశ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సుప్రీం కోర్టు (Supreme Court) దృష్టిలోనూ తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చైనా భారత్ సరిహద్దు ప్రాంతాల్లో 2 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ పరిమితుల్లో ఉండకపోవడంతో ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరాయి.రాహుల్ గాంధీ తన తాజా సభల్లో మాట్లాడుతూ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ భద్రతా అంశంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, లడఖ్ ప్రాంతంలో చైనా పెద్ద ఎత్తున భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో పరువు నష్టం కింద పరిగణించబడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
భారత సైనికులను తొక్కేస్తున్నాయని వివరించారు
ఈ సందర్భంగా విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు కఠినమైన మాటలతో రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.2022 భారత్ జోడో యాత్ర సందర్భంగా, భారత్-చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. చైనా సైన్యం మన దేశ భూభాగంలోని 2,000 చదరపు కిలో మీటర్ల భూమిని ఆక్రమించిందని పలుమార్లు ఆరోపించారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను తొక్కేస్తున్నాయని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై పరువు నష్టం కేసు నమోదు చేసింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లగా, మే 29న రాహుల్ గాంధీకి జరిమానా విధించింది.దీంతో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు రాజకీయకంగా ప్రేరేపించబడిందని, కావాలనే తనపై కోపంపై పలువురు ఈ కేసు పెట్టారని వాదించారు.

పిటిషన్‌ను తోసి పుచ్చుతూ
అయితే తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా చైనీయులు 2 వేల చదరపు కిలో మీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్నారని మీకు ఎలా తెలుసంటూ వ్యాఖ్యానించింది. అలాగే మీరు నిజమైన భారతీయులు అయితే ఇలా మాట్లాడి ఉండరంటూ చెప్పింది.లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన మీరు, ఇలాంటి విషయాలు ప్రజలకు ఎలా చెబుతారని ప్రశ్నించింది. అలాగే పార్లమెంటులో ఈ ప్రశ్నలు ఎందుకు అడగరని కూడా అడిగింది. న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం, ఆయన పిటిషన్‌ను తోసి పుచ్చుతూ వాక్ స్వాతంత్ర్యం సైన్యాన్ని కించపరిచేలా ఉండకూడదని చెప్పింది. సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ఒక రాజకీయ నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడటం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టంగా తెలియజేయగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం కోర్టు ఎప్పుడు స్థాపించబడింది?
సుప్రీం కోర్టు 28 జనవరి 1950లో స్థాపించబడింది.
సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
సుప్రీం కోర్టు ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: