పహల్గాం ఉగ్రదాడిలో 26మంది మరణించారు. కేవలం హిందువులు, పురుషులను మాత్రమే టార్గెట్ చేసుకుని, ఈ దాడికి పాల్పడ్డంతో,ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పై నిరసన వ్యక్తం అవుతున్నది. అయినా పాకిస్తాన్ ఆ దాడులతో తమకు ప్రమేయం లేదని బుకాయిస్తూ వస్తున్నది. అయితే,తాజాగా ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ తాహిర్ హబీబు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (Pakistan-occupied Kashmir) లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఈ చర్యతోపహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రేమియం ఉందని భారత్ ఆరోపణలకు గట్టి ఆధారం లభించింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందనిమరోసారి రుజువైంది.
‘ఆపరేషన్ మహాదేవ్’లో మట్టుబెట్టిన భారత్
తాహిర్ హబీబ్ అలియాస్ ‘ఆఫ్ఘానీ’ అనే ఈ ఉగ్రవాదిని ఇటీవల భారతసైన్యం ‘ఆపరేషన్ మహాదేవ్’లో భాగంగా మట్టుబెట్టింది. ఆ ఆపరేషన్ లో,భాగంగా శ్రీనగర్ కు సమీపంలోని మహాదేవ్ పర్వతప్రాంతంలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) భారత భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ ముగ్గురు,పాకిస్థాన్ కు చెందినవారేనని, ముఖ్యంగా తాహిర్ హబీబు పాకిస్తాన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు గుర్తించాయి.
అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు
తాహిర్ హబీబ్ మృతదేహం లభ్యం కానప్పటికీ, పీఓకేలోని రావల్కోట్ ఖైగలాలో అతడిని ‘ఖనాజా ఏ గైబ్` అనే విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధానం మృతదేహం లేనప్పుడు అనుసరిస్తారు. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి పాకిస్తాన్ సైన్యాధికారులు, లష్కరే తోయిబాకమాండర్లతో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో,పాకిస్తాన్ తీరు ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది.
తీవ్రంగా స్పందించిన భారత్
భారతవిదేశాంగ శాఖ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం పాకిస్తాన్ కు అలవాటుగా మారిందని, ఇది ప్రపంచశాంతికి పెనుప్రమాదమని పేర్కొంది. పహల్గామ్ం దాడిలో పాకిస్తాన్ హస్తం లేదని పాక్ చేస్తున్న అబద్ధాలు అని,నిరూపించడానికి ఈ ఘటన తిరుగులేని రుజువుగా నిలిచింది. ఈ ఘటనపై భారత్, అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకుంది.నిత్యం పహల్గామ్ దాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని, భారతదేశం తమదేశంపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నదని పాకిస్తాన్ చెబుతూ వస్తున్నది. ఇటీవల ఈ దాడిని అమెరికా కూడా ఉగ్రసంస్థ పనిగా తేల్చింది. అయినా పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని మాత్రం మానడం లేదు.ఉగ్రవాదులకు ఆర్థికసాయంతోపాటు సామాజిక మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ తీరు మారనంతవరకు భారత్ కు చిక్కులే.
POK అంటే ఏమిటి?
POK అంటే Pakistan Occupied Kashmir (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్).
టెర్రరిజం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
ప్రభుత్వాలను లేదా సమాజాన్ని భయపెట్టడం, తమ డిమాండ్లను బలవంతంగా అమలు చేయించడం, ప్రధాన ఉద్దేశం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: