టెక్ రంగంలోకి అడుగుపెడుతున్న వారికి ఇది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కేవలం 24 ఏళ్ల యువ పరిశోధకుడి కోసం టెక్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో టాలెంట్‌కు ఎంతటి విలువ ఉందో ఈ సంఘటనే ఉదాహరణ.మెటా (Matt Deitke) సంస్థ ఒక యువ ఏఐ పరిశోధకుడి కోసం సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (CEO Mark Zuckerberg) స్వయంగా జోక్యం చేసుకున్నారు. మాట్ డీట్కే అనే 24 ఏళ్ల టెక్ ప్రతిభావంతునికి మొదట $125 మిలియన్ ఆఫర్ చేశారు. కానీ అతను ఆ ఆఫర్ తిరస్కరించాడు.ఇందుకు స్పందనగా, జుకర్‌బర్గ్ సరిగా రెస్పాండ్ చేశారు. ఆయన స్వయంగా సంప్రదింపులు జరిపి ఆఫర్‌ను రెట్టింపు చేశారు. మొత్తానికి $250 మిలియన్ ప్యాకేజీతో మాట్‌ను మెటాలోకి తీసుకురాగలిగారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ. 2,085 కోట్లు.

డీట్కే ఎవరు? ఎందుకు అంత craze?
మాట్ డీట్కే అసలు పీహెచ్‌డీ విద్యార్థి. వాషింగ్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలోనే, మధ్యలో కోర్సు వదిలేసి పరిశోధనలపై దృష్టి పెట్టాడు. 2022లో న్యూరిప్స్ కాన్ఫరెన్స్‌లో అతను సమర్పించిన పేపర్‌కు ఉత్తమ పేపర్ అవార్డు వచ్చింది.ఈ విజయంతో అతని పట్ల పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. ఆ తరువాత అలెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఏఐలో పనిచేశాడు. అక్కడ ‘మోల్మో’ అనే చాట్‌బాట్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించాడు. ఇది టెక్స్ట్‌తో పాటు, చిత్రం, ఆడియోను కూడా అర్థం చేసుకోగలదు.
స్టార్టప్ కూడా మొదలెట్టాడు!
2023లో డీట్కే తన స్టార్టప్ ‘వెర్‌సెప్ట్’ ప్రారంభించాడు. కేవలం 10 మంది టీంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇప్పటికే గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ వంటి ప్రముఖుల నుంచి $16.5 మిలియన్ నిధులు సమీకరించారు.ఈ ఘట్టంపై MIT ఆర్థికవేత్త డేవిడ్ ఆటర్ స్పందిస్తూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. “కంప్యూటర్ సైంటిస్టులకు ప్రొఫెషనల్ అథ్లెట్ల స్థాయిలో జీతాలు అందుతున్నాయి. ఇది నిజంగా ‘రివెంజ్ ఆఫ్ ది నెర్డ్స్’!” అని చెప్పారు.
ఏఐ రంగంలో పోటీ బహుశా ఇదే శిఖరం
మెటా సంస్థ ఇప్పటివరకు కేవలం ఏఐ నిపుణుల కోసం $1 బిలియన్‌కి పైగా ఖర్చు చేసింది. ఈ (alone data) చూస్తేనే, ఏఐ రంగంలో టాలెంట్ కోసం ఎంత తీవ్రంగా పోటీ జరుగుతోందో అర్థమవుతుంది.ఏఐ ఫీల్డ్ లో ప్రతిభ ఉంది అంటే, ప్రపంచ దిగ్గజాలు స్వయంగా ముందుకొస్తున్నాయి. డీట్కే ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు – టాలెంట్ ఉన్న వారికి ఈ రంగం అమితమైన అవకాశాలను ఇచ్చే స్థాయికి చేరుకుంది.
Read Also : Joe Root : భారత్‌కు 4 వికెట్లు… ఐదో రోజుకు చేరిన థ్రిల్లర్!