శ్రీవారి దర్శనం వేగవంతం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయత్నాలు ప్రారంభించగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subramanyam) కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సాధ్యం కాని లక్ష్యం: గంటలో దర్శనం అనేది కలనే!
తాజాగా తాను తిరుమలకు వచ్చిన సందర్భంలో భక్తుల మధ్య సంభాషణలో ఏఐ టెక్నాలజీ (AI technology) ద్వారా గంటలో దర్శనం అందిస్తారన్న అంశం తన దృష్టికి వచ్చిందని ఎల్వీ చెప్పారు. అయితే, ఆలయ నిర్మాణ పరిమితులు, భక్తుల సంఖ్య వంటి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఆచరణలో అసాధ్యం అని ఆయన తేల్చిచెప్పారు.
ధన వ్యయం కంటే భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలి
ఏఐ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయకూడదని, బదులుగా ఆ నిధులను భక్తుల కోసం మరిన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించాలని ఆయన సూచించారు. గంట లేదా రెండు గంటల్లో దర్శనం కల్పించాలన్న ఆలోచన మంచిదైనా, ప్రస్తుత పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని పునర్విమర్శించాలని టీటీడీని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subramanyam) మాట్లాడుతూ, “ఆ ఆలోచనను దయచేసి విరమించుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దాని కోసం అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా, ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న దర్శన సమయం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది. కాబట్టి, ఆ నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది అని వివరించారు. ఇదే సమయంలో, టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్మప్రచార కార్యక్రమాలకు మరింత ఊపునివ్వాలని ఆయన టీటీడీ ఛైర్మన్‌ను కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: